»   » పాదయాత్ర: పవన్ సంచలన నిర్ణయం, మరి సినిమాలో?

పాదయాత్ర: పవన్ సంచలన నిర్ణయం, మరి సినిమాలో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుండటం నా వల్ల కాలేదు అంటూ రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా...ఎన్నికల తర్వాత కూడా తన మార్కును కొనసాగించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇందులో భాగంగా ఆయన ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 'పాదయాత్ర' నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఇచ్చిన హామీలని నెరవేర్చే బృహత్కార్యం తన బుజస్కందాలపై వేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎవరైనా వోట్ల కోసం పాదయాత్రలు చేయడం చూసాం కాని ఎలక్షన్లు అయిపోయాక చేయడం నిజంగా పవన్ నిజయతీకి నిదర్శనం అని పలువురు చర్చించుకుంటున్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

తను మద్దతు ఇచ్చాడు కాబట్టే

తను మద్దతు ఇచ్చాడు కాబట్టే

తను మద్దతు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వస్తే, ఆ పార్టి ఇచ్చిన హామీలకు అండగా తను ఉంటానని మేసేజ్ పవన్ జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడట.

జనసేన

జనసేన

అలా చేయకపోతే మెడలు వంచేనా జనసేన పార్టి పనులు చేయించుకుంటుందనే మేసేజ్ ను పాదయాత్ర ద్వార పవన్ తెలియపరచాలనుకుంటున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ పాదయాత్ర ప్లాన్ చేసారట.

సినిమాల సంగతేంటి?

సినిమాల సంగతేంటి?

కాగా ఎన్నికల తర్వాత సినిమాల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ బిజి అయిపోతారని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ వార్తలు ప్రచారంలోకి రావడం ఇటు అభిమానులను, ఆయనతో సినిమాలు కమిటైన దర్శక నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రస్తుతం కమిటైన సినిమాలు

ప్రస్తుతం కమిటైన సినిమాలు

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రంతో పాటు, ‘ఓ మై గాడ్' సినిమా రీమేక్‌కు సిద్ధమయ్యారు

English summary
Rumors Circulating on Pawan Kalyan that, He will ready to Padayatra after elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu