»   » అదీ పవన్ ధీమా :గబ్బర్ సింగ్ లో 'అంత్యాక్షరి' ... 'సర్దార్' లో హైలెట్ ఇదీ

అదీ పవన్ ధీమా :గబ్బర్ సింగ్ లో 'అంత్యాక్షరి' ... 'సర్దార్' లో హైలెట్ ఇదీ

Posted By: Staff
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ లో హైలెట్ ఎపిసోడ్ ఏమిటీ అంటే అంత్యాక్షరి ఎపిసోడ్ అని ఎవరైనా చెప్పేస్తారు. మరి అలాంటి ఎపిసోడ్ ని ఈ సారి పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రంలో ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది అందరికీ ఆసక్తికరమైన విషయమే.

ఈ విషయాన్ని పవన్ సైతం దృష్టిలో పెట్టుకుని ఓ సర్పైజ్ ప్యాకేజ్ ('చిరు సినిమాక్షరి') ని సినిమాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అది మరేదో కాదు ...చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ కి పవన్ స్టెప్స్ వేయటం. వాటిల్లో హైలెట్ వీణపాట స్టెప్ అని తెలుస్తోంది.


Also Read: పవన్ ఆ స్టెప్ వేస్తూంటే...నా సామిరంగా..విజిల్సే విజిల్స్


అంతేకాదు కొన్ని పాపులర్ చిరంజీవి పంచ్ డైలాగ్స్ ని పవన్ ఈ సినిమాలో పలకనున్నారు. దాదాపు పదిహేను నిముషాలు పైగా సాగే ఈ ఎపిసోడ్ సెకండాఫ్ లో వస్తుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవి పాటలకు డాన్స్ లు, స్టెప్స్, పంచ్ డైలాగులు తో కేక పెట్టించనున్నారని సమాచారం.


గుండెలనిండా ధైర్యమే కాదు... మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. పోలీసు కదా అని ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. మొన్నటిదాకా ప్రతినాయకులపై తూటాలు పేల్చిన సర్దార్‌ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయితో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలోనే ఈ ఎపిసోడ్ వస్తుంది. ఆ హంగామా ఎలా ఉంటుందో 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలోనే చూడాలి.


మెగా ఎపిసోడ్ గురించి మరిన్ని విశేషాలు..స్లైడ్ షోలో


ఇందుకోసం ప్రత్యేకంగా

ఇందుకోసం ప్రత్యేకంగా

ఈ ఎపిసోడ్ కోసం పవన్ ప్రత్యేకంగా ఓ టీమ్ ని ఏర్పాటు చేసిన దాదాపు రెండు నెలలపాటు వర్క్ చేసినట్లు తెలుస్తోంది.ఎక్కువ ఇన్ పుట్స్

ఎక్కువ ఇన్ పుట్స్

ఈ ఎపిసోడ్స్ లో ఎక్కువ ఇన్ పుట్స్ పవన్, దర్శకుడు బాబీ ఇచ్చారని అంటున్నారు.ట్రైనింగ్

ట్రైనింగ్

ఈ ఎపిసోడ్ లో చిరంజీవి స్టెప్స్ వేసేందుకు ఓ కొరియోగ్రాఫర్ తో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.ట్రైడ్ మార్క్

ట్రైడ్ మార్క్

పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ మ్యానరింజం ని చిరంజీవి డైలాగులకు మిక్స్ చేయనున్నారుహైలెట్

హైలెట్

ఈ ఎపిసోడ్ లో వీణ స్టెప్ తో పాటు, చిరంజీవి ఘరానా మొగుడులో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో అనే మ్యానరిజం హైలెట్ అవుతుందంటున్నారు.జబర్దస్త్ బ్యాచ్

జబర్దస్త్ బ్యాచ్

ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు జబర్దస్త్ బ్యాచ్ కూడా ఉంటుందని అంటున్నారు.కాజల్ సైతం

కాజల్ సైతం

ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ కాజల్ పై కూడా ఓ సాంగ్ బిట్ ఉందని అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ని మిక్స్ చేసి వదలుతారు


కొండవీటి రాజా

కొండవీటి రాజా

అలాగే చిరంజీవి సూపర్ హిట్ కొండవీటి రాజా లోని నా కోక బాగుందా పాట కూడా ఉంది.ఒప్పుకోలేదు

ఒప్పుకోలేదు

అంత్యాక్షరి లాంటి ఎపిసోడ్ కావాలని చెప్పినప్పుడు రకరకాల ఆలోచనలు టీమ్ ఇచ్చింది. అందులో ఇది ఒకటి. దీనికే టీమ్ మొత్తం ఓటేసింది. అయితే ఇందుకు మొదట చిరంజీవి ఒప్పుకోలేదు.పండుగే

పండుగే

ఈ ఎపిసోడ్ ..చిరంజీవి కి తను ఇచ్చే ట్రిబ్యూట్ గా ఉంటుందని, మెగాభిమానులు ఆనందించే ఎపిసోడ్ అవుతుందని వినపడుతోందిచిరంజీవి విని

చిరంజీవి విని

ఈ ఎపిసోడ్ గురించి చిరంజీవి కు చెప్పగానే నవ్వి, మంచి పాటలతో డిజైన్ చేయమని చెప్పినట్లు సమాచారం.ఫన్ తో

ఫన్ తో

ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా ఫన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు సమాచారం. అలాగని ఎక్కడా కూడా ఆ పాటలు డీ గ్రేడ్ కాకూడదని స్ట్రిక్ట్ గా చెప్పి చేయిస్తున్నారు.ఫలితం

ఫలితం

ఈ ఎపిసోడ్ చేయటం వల్ల పవన్, చిరంజీవి ఒకటే అన్న ఆలోచన జనాల్లోకి వెళ్తుంది. అన్నదమ్ముల మధ్య విభేధాలు లేవనేది స్పష్టం చేసినట్లు ఉంటుంది.


రిపీట్ ఆడియన్స్

రిపీట్ ఆడియన్స్

ఇలాంటి ఎపిసోడ్ వల్ల ఒకటికి నాలుగుసార్లు రిపీట్ ఆడియన్స్ వచ్చి చూస్తూంటారు. అది భాక్సాఫీస్ కు బాగా ప్లస్ అవుతుంది.స్పెషల్ కామెడీ వద్దు

స్పెషల్ కామెడీ వద్దు

సినిమాలో ప్రత్యేకమైన కామెడీ వద్దని, రొటీన్ పంచ్ డైలాగులు అసలు వద్దని, సినిమాలో భాగంగా వచ్చే ఫన్ నే బాగా చేయాలని పవన్ నిర్ణయించుకునే స్క్రిప్టు డిజైన్ చేసారు.భారీగా

భారీగా

ఈ చిత్రానికి ఆడియో పంక్షన్ ని భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఎన్నడూ లేని విధంగా

ఎన్నడూ లేని విధంగా

గతంలో ఎన్నడూ లేని విధంగా తన చిత్రం షూటింగ్ స్పాట్ లో సెలబ్రెటీలతో సెల్ఫీ లు తీసి వదలటానికి ఫర్మిషన్ ఇచ్చారు.సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 18, 2015న విడుదల అవుతోంది.హార్స్ మేళా

హార్స్ మేళా

'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం. ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు.


అదీ పవన్ ధీమా :గబ్బర్ సింగ్ లో 'అత్యాక్షరి' ... 'సర్దార్' లో హైలెట్ ఇదీ

అదీ పవన్ ధీమా :గబ్బర్ సింగ్ లో 'అత్యాక్షరి' ... 'సర్దార్' లో హైలెట్ ఇదీ

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
English summary
It's going to be a complete surprise package in Sardar Gabbar singh. The episode will be laced with old hit songs of Chiranjeevi. Besides doing the veena step, Pawan Kalyan will also mouth some of his popular punch dialogues
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu