»   » కాపీరైట్స్ తీసుకోవాలని పవన్ ఫిక్సయ్యాడు?

కాపీరైట్స్ తీసుకోవాలని పవన్ ఫిక్సయ్యాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్‌' సూపర్ హిట్‌ అయ్యాక ఆ టైటిల్‌పై పవన్‌కళ్యాణ్‌కి, ఆయన ఫ్యాన్స్ కు ప్రత్యేక అభిమానం ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో మళ్లీ అదే టైటిల్‌తో సినిమా తియ్యాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈసారి సంపత్‌నంది దర్శకత్వంలోని సినిమాకి 'గబ్బర్‌సింగ్‌ 2' అనే టైటిల్‌ని ఫైనల్‌ చేశాడని సమాచారం. అయితే ఈ టైటిల్ కు కాపీ రైట్స్ సమస్య ఉంది. దాంతో పవన్ ... ఈ టైటిల్ రైట్స్ డబ్బు చెల్లించి తీసుకోవాలని,వేరే టైటిల్స్ పెట్టకూడదని ఫిక్సయ్యినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఇక ఇప్పటికే సంపత్‌ స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్‌కెళ్లడానికి రెడీ అయ్యాడు. అయితే టైటిల్‌ కన్ఫ్యూజన్‌ తేలటం లేదు. ఆయన ఫ్యాన్స్,సన్నిహితులు చాలా మంది గబ్బర్ సింగ్ పెడితేనే ఆ క్రేజ్ ఉంటుందని చెప్తున్నారు. దాంతో పవన్‌ ....'గబ్బర్‌సింగ్‌' టైటిల్ ని 'షోలే' నిర్మాతల నుంచి కొనేయడానికి రెడీ అయిపోయాడని చెప్తున్నారు. భారీ మొత్తం చెల్లించి అయినా కాపీరైట్‌ హక్కుల్ని తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓ సమాచారం. గతంలో 'బెంగాళ్‌ టైగర్‌', 'పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌2' అనే టైటిల్స్‌ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక అవన్నీ లేనట్టే. 'గబ్బర్‌సింగ్‌-2' ఫైనల్‌ అయినట్టే. 'అత్తారింటికి దారేది' రిలీజయ్యాకే గబ్బర్‌ సెట్స్‌కెళతాడని అంటున్నారు.

ఇక పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇదివరకు ప్రకటించినట్లుగా అక్టోబర్ 9న కాకుండా దాదాపు రెండు వారాల ముందుగానే సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. థియేటర్లలో విడుదల కాకముందే ఆ సినిమా పైరసీకి గురై, ప్రథమార్ధం ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముందుగానే సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మించారు.

'అత్తారింటికి దారేది' సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో పైరసీలో చేయడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్మాతల మండలి హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "దీన్ని దురదృష్టకరమని అనాలో, దుర్మార్గమని అనాలో తెలీడం లేదు. పైరసీపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పైరసీని అడ్డుకోవడంలో పవన్‌కల్యాణ్ అభిమానులతో పాటు బాధ్యత కలిగిన పౌరులందరూ సహకరించాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్లే ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది'' అని ఆయన చెప్పారు.

English summary

 ‘Bengal Tiger’ is the title in consideration for Gabbar Singh sequel till sometime back. But after lot of discussions, it is heard that Pawan Kalyan decided to pay some money for copyrights of using the name Gabbar. Earlier producer Bandla Ganesh also paid money for Bollywood’s Sholay makers to use the title Gabbar Singh. Anyway, the title of GS sequel is going to be ‘Gabbar Singh 2′ and that excites fans a At any rate, the title of Gabbar Singh continuation is set to be ‘Gabbar Singh 2′ and that energizes fans a considerable measure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu