»   » పట్టపగలు...పవన్ కళ్యాణ్ 'పులి' ఆడియో పంక్షన్

పట్టపగలు...పవన్ కళ్యాణ్ 'పులి' ఆడియో పంక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా ఆడియో పంక్షన్స్ రాత్రిళ్ళు జరుగుతూంటాయి. అయితే పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రం ఆడియో మాత్రం జులై 11ఉదయం జరగనుందని సమాచారం. ఎఆర్ రహమాన్ కి వేరే బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. మొదట డైరక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేద్దామనుకున్నా సినిమాకు క్రేజ్ తేవాలనే ఉద్దేశ్శంతో మళ్ళీ ఆడియో పంక్షన్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నారని వినపడుతోంది. అందుకు తగినట్లే శిల్ప కళా వేదికలో ఈ చిత్రం ఆడియోను సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేసి, క్రేజ్ తీసుకురానున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.జె.సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu