twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌కే తలవొగ్గుతా.. వారికి ఎందుకు.. నిర్మాతకు పవన్ కల్యాణ్ షాక్

    By Rajababu
    |

    అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌తో పవన్ కల్యాణ్‌కు అనేక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం రికార్డు స్థాయి నష్టాలను మిగిల్చింది. దాంతో నిర్మాత ఎస్ రాధాకృష్ణ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాధాక‌ృష్ణ ప్రతిపాదనను పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించారనే వార్తను ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించడం మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

     రాధాకృష్ణ నష్టనివారణ చర్యలు

    రాధాకృష్ణ నష్టనివారణ చర్యలు

    టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎస్ రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. నైతిక విలువలకు కట్టుబడి ఉంటారని చెప్పుకొంటారు. సాధారణంగా సినిమా నష్టాల పాలైతే డిస్టిబ్యూటర్లను పట్టించుకొన్న పాపాన పోరు. మహా అయితే కొన్ని నెలల తర్వాత డిస్టిబ్యూటర్ల గోడును పరిగణనలోకి తీసుకొని వారి నష్టాలకు ఏదో రకంగా భరోసా ఇస్తారు.

    Recommended Video

    'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు.. వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..!
    డిస్టిబ్యూటర్ల కష్టాలు తనపైకి

    డిస్టిబ్యూటర్ల కష్టాలు తనపైకి

    కానీ అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ సినిమా రిలీజైన రెండోవారం నుంచే డిస్టిబ్యూటర్ల కష్టాలను తనపై వేసుకొన్నాడట. ఈ చిత్రాన్ని 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రిలీజ్‌కు ముందే 8 కోట్ల మేర లాభాలను చేజిక్కించుకొన్నారు.

    15 కోట్ల చెల్లింపులు

    15 కోట్ల చెల్లింపులు

    అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ రావడం, కలెక్షన్లు దారుణంగా ఉండటంతో సుమారు 15 కోట్ల మేర నష్టాన్ని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. దాంతో ఆ మేర డబ్బును డిస్టిబ్యూటర్లకు సర్దుబాటు చేసేందుకు రాధాకృష్ణ సిద్దమయ్యారట.

     ఫ్యాన్స్‌కే రుణపడి ఉంటాను

    ఫ్యాన్స్‌కే రుణపడి ఉంటాను

    ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌ను రాధాకృష్ణ సంప్రదించారని, అందుకు ఆయన ప్రతికూలంగా స్పందించినట్టు ఓ వెబ్‌సైట్ కథనంలో పేర్కొన్నది. వారి మధ్య చర్చల సందర్భంగా నేను ఫ్యాన్స్‌కు మాత్రమే రుణపడి ఉంటాను అని స్పష్టం చేశారట.

     రెమ్యునరేషన్ తిరిగి ఎందుకు

    రెమ్యునరేషన్ తిరిగి ఎందుకు

    డిస్టిబ్యూటర్లకు నా రెమ్యునరేషన్ నుంచి ఎందుకు తిరిగి ఇవ్వాలి. లాభాలు వస్తాయనే ఆశతోనే బిజినేస్ చేశారు. మీరు నిర్మించిన అ ఆ సినిమా సందర్భంగా లాభాలొస్తే వారైమైనా తిరిగి ఇచ్చారా అని పవన్ ప్రశ్నించినట్టు కథనంలో పేర్కొన్నారు. బిజినెస్ అన్నప్పుడు లాభం, నష్టం ఉంటుందనే అంచనా వారికి ఉంటుంది కాదా అని అన్నట్టు సమాచారం.

    English summary
    Producer S Radhakrishna, who has good name among the industry circles as he is fair in dealing the business and doesn't indulge in controversies, has come forward to compensate the distributors of "Agnyaathavaasi" who have incurred huge losses. "I owe nothing to them except for the fans. When the distributors bought your company's earlier movie "A Aa" for mere Rs 40 Cr, why did they come to buy "Agnyaathavaasi" for Rs 120 Cr? Because they felt they could make profits even on 120 Cr businesses since this film has such craze.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X