twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంతవరకూ నిజం?: పవన్ స్ట్రాంగ్ డెసిషన్ ..చిరంజీవి బ్రేక్ లు..టీవిల్లోకి

    By Srikanya
    |

    హైదరాబాద్: చిరంజీవికు, పవన్ కళ్యాణ్ కు అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ అనుబంధం ఉంది. చిరంజీవి ని తన తండ్రి తర్వాత తండ్రిలా భావిస్తానని పనవ్ ఎన్నో సార్లు చెప్పారు. వీరిద్దరి మధ్యా విభేధాలు వచ్చినట్లు కనిపించినా అవి శాశ్వతం అందుకనే కాలేదు.

    అలాగే చిరంజీవి....తన తమ్ముడు కెరీర్ కు సంభందించిన విషయాల్లో ప్రారంభ రోజుల్లో పట్టించుకున్నా తర్వాత పవన్ నిర్ణయాలకే పూర్తిగా వదిలేసాడు. పవన్ సైతం తన సొంత ఆలోచనలతో,నిర్ణయాలతో కెరీర్ లో ఓ స్దాయికి వచ్చారు. అయితే రీసెంట్ గా అన్నదమ్ములు ఓ విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

    అది మరేదో కాదు పవన్ కళ్యాణ్ రిటైర్ మెంట్ గురించి. ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలను పూర్తి చేసి తర్వాత సినిమాలకు బై చెప్పి పూర్తి స్దాయి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది.

    అయితే ఈ విషయమై కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్ ..రిటైర్మెంట్ కు ఇది సరైన సమయం కాదని, తను అలాంటి నిర్ణయమే తీసుకుని ఇంత గ్యాప్ తెచ్చుకున్నాని అని బ్రేక్ లు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    అయితే రిటైర్ అయిన తర్వాత పవన్ వెంటనే తీసుకునే స్టెప్స్ ఏమిటి...ఆల్రెడీ ఏం ఆలోచనలు నడుస్తున్నాయి వంటి విశేషాలతో ...

    స్లైడ్ షోలో మిగతా విశేషాలు...

    అందుకే ఈ నిర్ణయం

    అందుకే ఈ నిర్ణయం



    రాజకీయాల్లో పూర్తి స్థాయి క్రియాశీలక పాత్ర పోషించేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.

    క్షేత్రస్థాయికి

    క్షేత్రస్థాయికి

    తను స్థాపించిన 'జనసేన' పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన ఈ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు

    ఇప్పటినుంచీ..

    ఇప్పటినుంచీ..

    హఠాత్తుగా అప్పటికప్పుడూ సినీ పరిశ్రమలో నిర్ణయాలు తీసుకోవటం కుదరదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒకటి, రెండేళ్ల తర్వాత మొదలయ్యే సినిమాల గురించి కూడా ఉంటాయి.

    కాబట్టే ఇప్పుడే బ్రేక్ లు

    కాబట్టే ఇప్పుడే బ్రేక్ లు

    కొత్త సినిమాలకు కమిటవ్వటం ఇప్పటినుంచే ఆపుచేస్తే... ఉన్న సినిమాలు ఫినిష్ చేసే పని మాత్రమే మిగులుతుంది.

    రెండు పడవలపై

    రెండు పడవలపై

    అటు సినిమా, ఇటు రాజకీయం..ఇలా రెండు పడవలపై కాలు పెట్టడం కష్టం అనే ఈ నిర్ణయానికి పవన్ వచ్చినట్లు చెప్తున్నారు.

    ప్రస్తుత ఆలోచన

    ప్రస్తుత ఆలోచన

    ప్రస్తుతం పవన్ ...పార్టీ నిర్మాణానికి ..అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారట.

    అందు కోసమే..

    అందు కోసమే..

    సినిమాల్లో నటించడంతోపాటు.. నిర్మాణ రంగంలో కూడా భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    టార్గెట్ ..వంద కోట్లు

    టార్గెట్ ..వంద కోట్లు

    పార్టీ కోసం...రాబోయే రెండు,మూడేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలను సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

    అదే ఆఖరది

    అదే ఆఖరది

    2018 సంక్రాంతికి పవన్ నటించే ఆఖరి సినిమా తెర మీదకొస్తుందని అని చెప్తున్నారు.

    2019 దాకా

    2019 దాకా

    సంక్రాంతికి తన చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఇంక ఏ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొనకుండా... ఎలక్షన్స్ వచ్చేవరకూ జనంలో ఉంటారు. వారితో ప్రయాణం చేస్తారు.

    ఎలక్షన్స్ ...

    ఎలక్షన్స్ ...

    సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి 2019 ఎన్నికలకు సంబంధించి పవన్ బిజీ అవుతారని వినికిడి.

    సోషల్ మీడియాలో ..

    సోషల్ మీడియాలో ..

    రూమరో, నిజమో కానీ గత రెండు రోజులుగా ఈ వార్త పవన్ అభిమానుల్లో దావానలంలా వ్యాపిస్తోంది. సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది

    చేదు వార్తే

    చేదు వార్తే

    ఏదేమైనా పవర్ స్టార్ అభిమానులకు, ఆయన సినిమా అభిమానులకు మాత్రం ఇది చేదు వార్తే.

    ఈ వేసవికి..

    ఈ వేసవికి..

    ప్రస్తుతం సెట్స్ మీదున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

    సత్యమేవ జయితే

    సత్యమేవ జయితే

    ఆ తర్వాత ఈటీవి కోసం సత్యమేవ జయితే వంటి పోగ్రామ్ తో జనం ముందుకు వస్తారు.

    ట్రైనింగ్

    ట్రైనింగ్

    సత్యమేవ జయితే తరహాలో చేసే పోగ్రాం ద్వారా జనసేన సభ్యులకు, తన ఫాలోవర్స్ కు ట్రైనింగ్ ఇస్తారు.

     దాసరిదా

    దాసరిదా

    పుల్ స్టాఫ్ పెట్టబోయే సినిమా ఎవరిది ఉండబోతోంది...దాసరి సినితోనా అంటున్నారు. ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చి మరీ బ్రేక్ ఇస్తాడంటున్నారు.

    సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

    సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

    ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 18, 2015న విడుదల అవుతోంది.

    హార్స్ మేళా

    హార్స్ మేళా

    'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం. ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు.

    English summary
    Pawan is planning to release his last film for Sankranti in the year 2018. Soon after this, he will start complete focus on his party Jana Sena from February 2018 and will constantly stay in touch with people till 2019 elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X