»   » రిలీజ్‌కు ముందే అజ్ఞాతవాసి సంచలనం.. బాహుబలి రికార్డు బ్రేక్.. పవన్‌ ఫైట్స్ కిర్రాక్ అట..

రిలీజ్‌కు ముందే అజ్ఞాతవాసి సంచలనం.. బాహుబలి రికార్డు బ్రేక్.. పవన్‌ ఫైట్స్ కిర్రాక్ అట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
రిలీజ్‌కు ముందే అజ్ఞాతవాసి సంచలనం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే పిచ్చా క్రేజ్ ఉంటుంది. జల్సా, అత్తారింటికి దారేది ఘన విజయాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే కిర్రాకే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్నది. అమెరికాలో ఈ చిత్రం కాబోయే థియేటర్ల సంఖ్య గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

 భారీ స్థాయిలో రిలీజ్

భారీ స్థాయిలో రిలీజ్

పవన్‌, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రానికి ఉన్న క్రేజ్‌‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను భారీగా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాధాకృష్ణ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్టు సమాచంర. పవన్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అమెరికాలోని 209 ప్రాంతాల్లో అజ్ఞాతవాసిని విడుదల చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

 బాహుబలిని మించి

బాహుబలిని మించి

అమెరికాలో ఈ రేంజ్‌లో పవన్ సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి2' 126 ప్రాంతాల్లో, చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 చిత్రాన్ని 74 లొకేషన్లలో, రజనీకాంత్ నటించిన కబాలి సినిమాను 73 లొకేషన్లలో, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ చిత్రం ‘దంగల్‌' 69 లొకేషన్లలో విడుదల చేశారు.

 పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అజ్ఞాతవాసి చిత్రంలో అభిమానులకు పిచ్చెక్కించే విధంగా ఫైట్స్ సీక్వెన్స్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. ఏకంగా ఈ చిత్రంలో ఏడు ఫైట్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం.

 భారీగా యాక్షన్ సీన్లు

భారీగా యాక్షన్ సీన్లు

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు చిత్రంలో ఫైట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. అతడు సినిమాకు మించిన ఫైట్స్‌ను ఈ చిత్రంలో కంపోజ్ చేసినట్టు తెలుస్తున్నది. మూడు యాక్షన్ సీన్లకైతే భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ ఫైట్స్‌ను రోమాలు నిక్కబొడిచే విధంగా రూపొందించినట్టు సినీవర్గాల్లో ప్రచారం అవుతున్నది.

 ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

ఇప్పుడు ఆ చిత్రాల రికార్డులను ‘అజ్ఞాతవాసి' తిరగరాయనున్నది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

 జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Pawan kalyan latest movie is Agnathavasi. This film is getting ready for Sankrathi festival. After this movie. This movie going to release in highest locations in US. Pawan movie is going to break all the records like Baahubali and Dangal Records theatre wise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu