twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ నిర్ణయం తప్పు పడుతున్న ఫ్యాన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, పవన్‌ కల్యాణ్‌ భాజపాకు మద్దతుగా కర్ణాటకలో ప్రచారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం కర్ణాటక పవన్ ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. వారు దీన్ని విభేదిస్తున్నారు. మోస్ట్ కరప్టడ్ పీపుల్ అయిన కర్ణాటక బిజెపీకు ప్రచారం చేయటం తమకు ఇష్టం లేదని ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. అక్కడ ప్రచారం చేయటం ద్వారా అవినీతికి ప్రచారం చేసినట్లు అవుతుందంటూ డైరక్ట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.

    అలాగే కొందరు...ఇలాంటి అవినీతితో నిండిన కర్ణాటక బిజీపీ నాయకులకు ప్రచారం చేయటం కన్నా ఎలక్షన్స్ నిలబడ్డ హౌస్ వైవ్స్,ఆటో డ్రైవర్స్, గుడ్డి వారి తరుపున ప్రచారం చేస్తే బాగుండునని అభిప్రాయపడుతున్నారు. ఇంకొకరు అయితే రాంగ్ స్టెప్ తీసుకున్నారని పవన్ ని తాను ఎంతగానో అభిమానిస్తున్నాని, ఇప్పుడు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు.

    Pawan Kalyan’s fans oppose his decision to campaign for BJP in Karnataka

    ఇక రాయచూరు, కోలార్‌, గుల్బర్గల్లో మంగళవారం జరిగే సభల్లో పవన్ పాల్గొంటారు. భాజపా లోక్‌సభ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఈ నియోజక వర్గాల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో ఉండటంతో పవన్‌ కల్యాణ్‌ను ప్రచారానికి రావాలని భాజపా విజ్ఞప్తి చేసింది. పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఉదయం నేరుగా హెలికాప్టర్లో రాయచూరు వెళ్తారు. భాజపా లోక్‌సభ అభ్యర్థి శివన్నగౌడ్‌ నాయక్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. మధ్నాహం కోలార్‌కు వెళతారు. ఇక్కడ అభ్యర్థి నారాయణ స్వామి తరఫున ప్రచారం చేస్తారు.

    సాయంత్రం గుల్బర్గకు చేరుకుంటారు. అభ్యర్థి రేవు నాయక్‌ బేలంగికి మద్దతుగా ప్రచారం చేస్తారు. మోడీ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి పవన్‌ కళ్యాణ్‌తో సమావేశం అయ్యారు. గంటన్నర పాటు వీరి మధ్య ఈ భేటీ జరిగింది. ప్రచారం చేయడానికి కొన్ని పవన్‌ కొన్ని షరతులు పెట్టారు. రెండు ప్రాంతాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు.. మతం, ప్రాంతం వంటి సున్నిత అంశాలను పవన్‌ ప్రస్తావించినట్లు సమాచారం.

    English summary
    Pawan Kalyan decision to campaign for the BJP has upset his fans. As soon as it was announced on Monday that the Jana Sena Party chief had agreed to campaign for the BJP in Karnataka, his fans took to the social media of the party expressing their disenchantment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X