»   » కొత్త దర్శకుడుతో 'గబ్బర్‌ సింగ్'సీక్వెల్

కొత్త దర్శకుడుతో 'గబ్బర్‌ సింగ్'సీక్వెల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం 'గబ్బర్‌ సింగ్'భాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుల క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ హిట్ కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు కి సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు గణేష్ 'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ ' టైటిల్ ని ఎపి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు.అలాగే స్క్రిప్టు వర్క్ కూడా ప్రారంభమైందని, ఈ సినిమాకు చెందిన బేసిక్ స్టోరీలైన్ ని పవన్ ఓకే చేసారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు డైరక్ట్ చేస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది.


  అలాగే ఈ చిత్రం దబాంగ్ 2 కి రీమేక్ అవుతుందా లేదా కొత్త కథ అవుతుందా అనేది మాత్రం తెలియరాలేదు.మరో ప్రక్క గణేష్ బాబు....త్వరలో పవన్ తో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. దబాంగ్ 2 రైట్స్ సల్మాన్ ఖాన్ ఇస్తామని తనకు ప్రామిస్ చేసారని చెప్పారు.


  ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న 'బాద్‌షా' పనిలో ఉన్నాననీ, అలాగే పూరిజగన్నాథ్‌తో రెండు సినిమాలు చేయబోతున్నాననీ, అల్లు అర్జున్ తో ఒకటి మొదలయ్యిందని గణేష్ తెలిపారు. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం అన్నారు.

  English summary
  
 There was a buzz that Gabbar Singh might have a sequel and now it looks like the buzz is only growing strong. The latest we hear is that Gabbar Singh sequel is titled Gabbar Singh in Hyderabad. Yes, this was the title that has been registered at the AP Film Chamber of Commerce. Sources futher add that Bandla Ganesh would be producing the film under the banner of Parameswara Arts. Further, it was also buzzed that a new director would wield the megaphone for the sequel.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more