»   » రిలీజ్‌కి ముందే ‘కాటమరాయుడి’కి షాక్, సీన్లు లీక్ చేసిందెవరు?

రిలీజ్‌కి ముందే ‘కాటమరాయుడి’కి షాక్, సీన్లు లీక్ చేసిందెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాకు సంబంధించిన ఓ సీన్ ఆన్ లైన్లో లీక్ కావడం సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సంగతి తెలిసిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.

ఈ సీన్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ అని అంటున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఇది ఎడిటింగ్ రూమ్ నుండే లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్ర యూనిట్ వెంటనే ఈ సీన్ ఆన్ లైన్ నుండి తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

లీకైన సీన్ ఇదే

లీకైన సీన్ ఇదే

కాటమరాయుడు సినిమా నుండి లీక్ అయినట్లు ప్రచారం జరుగుతున్న సీన్ ఇదే. బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇంకా విఎఫ్ఎక్స్ కూడా పూర్తయినట్లు లేదు. బ్యాగ్రౌండ్ లో బ్లూకలర్లో కనిపిస్తున్న మ్యాట్ చూస్తే ఇది రా పుటేజ్ అని స్పష్టమవుతోంది.

rn

అప్రమత్తమైన టీం

సినిమాకు సంబంధించిన సీన్ ఆన్ లైన్లో లీక్ కావడంతో సినిమా యూనిట్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదల ముందే ఎడిటింగ్ రూమ్ నుండి లీకైన సంగతి తెలిసిందే.

పవన్-శృతి

పవన్-శృతి

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్-శృతి హాసన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘గబ్బర్ సింగ్'. ఇద్దరి హిట్ కాంబినేషన్ కావడంతో సెంటిమెంటు పరంగా కూడా కలిసొస్తుందని అంటున్నారు.

ఉత్సాహంగా ఉన్న టీం

ఉత్సాహంగా ఉన్న టీం

కాగా... 'కాటమరాయుడు' టీజర్‌ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి స్పందనరావడంతో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉంది. మార్చిలో సినిమా ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 10 నాటికి పోస్టు ప్రొడక్షన్ పనులు సహా సినిమా పూర్తవుతుంది.

నితిన్ దక్కించుకున్నాడు

నితిన్ దక్కించుకున్నాడు

మరో ప్రక్క 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ సొంతం చేసుకోవటంతో బిజినెస్ సర్కిల్స్ లో సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఈజీగా వస్తాయి

ఈజీగా వస్తాయి

నితిన్ పెట్టుబడి పెట్టిన ఆ ఇరవై కోట్లలో రెండు కోట్లు రికవరబుల్‌ అని తెలిసింది. అంటే లెక్క ప్రకారం...ఈ సినిమాపై నితిన్‌ ప్లస్‌ ఏషియన్‌ వాళ్ల రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు. సగం ఏషియన్ వాళ్లు షేర్ చుసుకంటారు కనుక నితిన్‌ పై తొమ్మిది కోట్లు రికవరీ భాధ్యత ఉంటుంది. అయితే సినిమా ఓ మోస్తరుగా ... యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నా ఈ అమౌంట్‌ తిరిగి వచ్చేస్తుంది.

English summary
Pawan Kalyan's upcoming release ‘Katamarayudu’ which is on the final leg of its shooting has started post production in parallel to meet the release date. But shockingly, a fight sequence which comes in the interval was leaked online and going viral all over.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu