twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయినట్లేనా?

    By Srikanya
    |

    Pawan Kalyan
    పవన్ కళ్యాణ్,సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో రూపొందతున్న ప్రిన్స్ ఆఫ్ పర్షియా చిత్రం పూర్తిగా ఆగిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. అది కేవలం రూమరా లేక నిజంగానే ఆగిపోయిందా అనేది మాత్రం అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోందని ఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారని అప్పట్లో వినిపించింది. ఈ మేరకు షూటింగ్ కూడా జరిగింది. ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

    జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుంది. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్‌ సూత్రాల్ని పాటించారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టు ఆగిపోయిందనే నేపధ్యంలో అస్సలు నిజాలు చెప్పాలంటే నిర్మాతే పూనుకుని మీడియాకు అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

    English summary
    Pawan Kalyan earlier committed to work with veteran director Singeetham Srinivasa Rao for the movie 'Prince of Peace', which is based on the incidents that took place in the life of Jesus Christ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X