Don't Miss!
- News
Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా.. మూవీ అదేనంటూ!
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇప్పటికే డజనకుపైగా హీరోలు ఆ ఇంటి వచ్చిన తర్వాత.. తాజాగా తెరపైకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ పేరు వచ్చింది. ఇంకా టీనేజ్ వయసులోనే ఉన్న ఈ కుర్రాడి పేరు ఓ క్రేజీ ప్రాజెక్టులో వినిపించడం చర్చనీయాంశమైంది. ఆ ప్రాజెక్టు వివరాల్లోకి వెల్లడానికి ముందు...
Recommended Video

టాలీవుడ్‌లోకి అకిరా ఎంట్రీ
కొద్దికాలంగా పవన్ కల్యాణ్ కుమారుడు అకిరాను హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త సినీ వర్గాల్లో నానుతున్నది. అయితే తల్లి రేణు దేశాయ్ నుంచి గానీ, తండ్రి పవన్ కల్యాణ్ నుంచి గాని క్లారిటీ రాలేదు అయితే మరోసారి అకీరా పేరు మళ్లీ వినిపించింది.

మహేష్ బాబు ప్రొడక్షన్‌లో
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ నుంచి వస్తున్న మేజర్ చిత్రంలో హీరోగా అడివి శేషు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అడివి శేషుతో అకిరా ఫోటో సోషల్ మీడియాలో వెలుగు చూడటం.. ఆ తర్వాత వైరల్‌గా మారింది.

మేజర్‌లో అకిరా నందన్
మేజర్‌లో ఓ కీలక పాత్రలో అకిరా కనిపిస్తాడు. ఈ యూనిట్ మంచి పాత్రలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అకిరాకు మంచి పేరు కూడా వస్తుంది అంటూ యూనిట్ వర్గాల వెల్లడించినట్టు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది ఇంకా అనుమానాస్పదంగానే ఉంది అని అంటున్నారు

అకిరా ఎంట్రీపై సందేహాలు
అయితే మేజర్ చిత్రంలో అకిరా నందన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కానీ ఈ వార్తపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అకీరా మూవీ ఎంట్రీ ఇలా ఉండకపోవచ్చు. ఒకవేళ పరిచయం చేయాలనుకొంటే భారీ రేంజ్‌లో అకిరా ఎంట్రీ ఉంటుంది అనే విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా
ఇదిలా ఉండగా, భారత సైన్యంలో మేజర్‌గా సేవలందిస్తూ ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ చిత్రం రూపొందుతున్నది. దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.