For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ నో చెప్తే..మహేష్ యస్ చెప్పాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్,మహేష్ లు వీరిద్దరే టాలీవుడ్ కు ఇప్పుడు నెంబర్ వన్ స్టార్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి అభిమానులు ఇక్కడే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా యుఎస్ మార్కెట్ లో వీరి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో రీసెంట్ గా తానా(తెలుగు అశోశియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వారు పవన్ ని ఛీఫ్ గెస్ట్ గా తమ ఏన్యువల్ సెలబ్రేషన్స్ కు డెట్రాయిట్ కు పిలిచారని సమాచారం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అయితే పవన్ తనకు కుదరదని సున్నితంగా తిరస్కరించారు. అయితే వెంటనే వారు మహేష్ ని కాంటాక్టు చేసి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. జూలై లో ఈ పోగ్రాం ఉండనుందని తెలుస్తోంది. అంటే యూఎస్ లో ఉండే మహేష్ అభిమానులకు పండగే అన్నమాట.

  Pawan Kalyan Said No, Mahesh Said OK

  ఇక మహేష్ 'శ్రీమంతుడు'తాజా విశేషాలకు వస్తే...

  మహేష్‌బా బుహీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో కొన్ని సన్నివేశాలు, పోరాట ఘట్టాలూ చిత్రీకరించారు.

  షూటింగ్‌ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్‌ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్‌పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

  ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  TANA had invited Pawan Kalyan as the chief guest for their biannual celebrations to be held at Detroit in the month of July.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X