»   » 'సర్దార్' యూనిట్ పై పవన్ సీరియస్, ఈ ఫొటో లీక్ కే

'సర్దార్' యూనిట్ పై పవన్ సీరియస్, ఈ ఫొటో లీక్ కే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తను ప్రస్తుతం చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం యూనిట్ పై సీరియస్ అయ్యాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో అని తెలుస్తోంది. ఆ ఫొటో మీరు ఇక్కడ చూస్తోంది.

పవన్ చాలా కూల్ గా ఉంటారు సెట్స్ లోనూ, ఎడిటింగ్ రూమ్ లోనూ , మిగతా చోట్ల తన యూనిట్ మెంబర్స్ తో . అయితే రీసెంట్ గా ఎడిటింగ్ రూమ్ నుంచి ఓ ఫొటో ఎలా బయిటకు వచ్చిందో వచ్చింది. ఆది ఆయన్ని ఇరిటేట్ చేసిందని సమాచారం.


Also Read: ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్


అత్తారింటికి దారేది చిత్రం లీకేజ్ ఎంత పెద్ద ఇష్యూ అయ్యిందో తెలిసిందే. అలాంటిది మరోసారి పునరావృతం కాకూడని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుని, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి మరీ పని చేయిస్తున్నారు. అయినా ఇలా ఫొటో వచ్చేయటం ఆయన్ని షాక్ కు గురి చేసిందని చెప్తున్నారు.


Pawan Kalyan Serious on Sardaar Movie Unit

ఇక 'సర్దార్ గబ్బర్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ ప్రతీ విషయంలోనూ స్పష్టమైన ప్లాన్ తో వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్, ప్రమోషన్, రిలీజ్ డేట్, ఇలా ప్రతి విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడంటున్నారు. ముఖ్యంగా చిత్రం రిలీజ్ విషయంలో ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటివి జరగటం మాత్రం ఇబ్బందికరమైన అంశమే.


ఈ చిత్రాన్ని సమ్మర్ కి తీసుకు వచ్చేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోన్నారు. ఈ మేరకు ప్లానింగ్ జరిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సండేస్ తప్ప శెలవు ఇవ్వకుండా...కాన్సర్టేషన్ గా వర్క్ చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. అలాగే కన్నడ భామ సంజన కూడా ఈ మధ్యనే ఈ లిస్ట్ లో చేరింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

English summary
There is one photo from Sardar editing screen that created tremors about Sardaar Gabbar Singh leakage that reportedly irritated Pawan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu