»   » పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ని వెనక్కి నెట్టిన యంగ్ డైరెక్టర్..!?

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ని వెనక్కి నెట్టిన యంగ్ డైరెక్టర్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్" చిత్రంలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇది హిందీ 'దబాంగ్" కి రీమేక్. కాగా..ఇటీవల విడుదలైన పవన్ 'తీన్ మార్" కి డివైడ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లు బాగున్నాయి. కావున అతని తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయి. అన్ని అంచనాల మధ్య సినిమా చేస్తే ప్రమాదం అని భావించిన హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్" కథని ఇంకా పటిష్టంగా చేయడానికి టైమ్ తీసుకోవాలనుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న పక్కా కమర్షియల్ ఫిలిం 'గబ్బర్ సింగ్' భారీ ఎత్తున నిర్మాణం జరుపుకోవడానికి మరికొంత సమయం పడుతుందని. దాంతో విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్ చేయనున్న 'ది షాడో" ముందు ఆరంభం అవుతుందని వినికిడి.

English summary
Pawan Kalyan’s next movie Shadow will start its first schedule during last week of this month. Director Vishnuvardhan has planned this schedule in west bengal. Heroine Sarah Jane Dias will also take part in this schedule.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu