Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా!
దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతడు.. రీఎంట్రీలో మరింత స్పీడును చూపిస్తున్నాడు. ఏకంగా మూడు సినిమాలను పట్టాలెక్కించేశాడతను. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఆ సంగతులు మీకోసం!
Recommended Video

లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ ఎంట్రీ
చాలా
రోజుల
క్రితం
రాజకీయాల
కోసం
సినిమాలకు
దూరమయ్యాడు
పవన్
కల్యాణ్.
సుదీర్ఘ
విరామం
తర్వాత
'వకీల్
సాబ్'
అనే
సినిమాతో
రీఎంట్రీ
ఇస్తున్నాడు.
వేణు
శ్రీరామ్
తెరకెక్కిస్తోన్న
ఈ
సినిమాను
దిల్
రాజు,
బోనీ
కపూర్
సంయుక్తంగా
నిర్మిస్తున్నారు.
ఇందులో
పవర్
స్టార్
లాయర్‌గా
కనిపించనున్నాడు.
దీనితో
పాటు
మరో
మూడు
చిత్రాలను
కూడా
లైన్‌లో
పెట్టేశాడీ
మెగా
హీరో.

కెరీర్‌లో మొదటిసారి అలాంటి సినిమా
సుదీర్ఘమైన కెరీర్‌లో పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాల్లో నటించాడు. అయితే, కెరీర్‌లో తొలిసారి పిరియాడిక్ జోనర్‌లో మూవీ చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

లేటు ప్రకటన.. ముందే ప్రారంభమైంది
పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

ఈగో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కల్యాణ్
ఈగో ఉన్న ఇద్దరు వ్యక్తుల కథతో ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ.. అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇందులో పవర్ స్టార్ రోల్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇద్దరికీ సమానమైన పాత్రలు రాసినప్పటికీ.. మెగా హీరోనే ఎక్కువ ఎలివేట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎన్నడూ చూడని విధంగా పవర్ స్టార్
రీఎంట్రీలో
ఫుల్
స్పీడుతో
దూసుకుపోతున్న
పవన్..
ఈ
రీమేక్
కోసం
అతడు
ఓ
సంచలన
నిర్ణయం
తీసుకున్నాడట.
తాజా
సమాచారం
ప్రకారం..
ఈ
సినిమా
కోసం
పవర్
స్టార్
భారీగా
బరువు
తగ్గబోతున్నాడట.
అంతేకాదు,
గతంలో
ఎన్నడూ
చూడని
విధంగా
సన్నగా
కనిపిస్తాడని
తెలిసింది.
ఈ
సినిమా
కోసం
పవర్
స్టార్
మేకోవర్
చాలా
కొత్తగా
ఉండబోతుందని
తెలుస్తోంది.

దాని కోసమే.. ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా?
ఇప్పటికే
పవన్
మూడు
సినిమాలను
పట్టాలెక్కించేశాడు.
ఈ
మూడింటికీ
తన
లుక్‌లో
వైవిధ్యాన్ని
చూపించాలని
భావిస్తున్నాడు.
ఇందులో
భాగంగానే
'అయ్యప్పనుమ్
కోషియం'
బాగా
సన్నగా
కనిపించడానికి
ప్రయత్నాలు
చేస్తున్నాడట.
అయితే,
మలయాళంలో
మాదిరిగా
తెలుగులో
చేస్తున్న
ఈ
లుక్
ప్రయోగం
వర్కౌట్
అవుతుందా
అన్న
సందేహాలు
వ్యక్తం
అవుతున్నాయి.