»   » పవన్ కళ్యాణ్ పై రిలయన్స్ ఒత్తిడి

పవన్ కళ్యాణ్ పై రిలయన్స్ ఒత్తిడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్ధ నుంచి పవన్ కళ్యాణ్ కి ఓ ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. పవన్ ప్రస్తుతం చేస్తున్న షాడో చిత్రానికి తాము భాగస్వాములం అవుతామంటూ వారు ముందుకొచ్చారని తెలుస్తోంది. అయితే ప్రాజెక్టులో క్రేజీ అయిన పవన్ కల్యాణ్ నిర్ణయం మీద ఆధారపడే వారు ఎగ్రిమెంట్ కుదుర్చోనున్నారు. అయితే పవన్ పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రిలయన్స్ వారు మోహన్ బాబు సంస్ధ తో చేసిన సలీం తో దెబ్బ తిని ఉండటంతో వారు ఆచితూచి అడుగు వేస్తున్నారు.మినిమం గ్యారెంటీ అనుకుంటేనే వారు డబ్బులు పెట్టడానకి రెడీ అవుతున్నారు.ఇక మహేష్ తప్ప తెలుగులో హీరోలందరూ కార్పోరేట్ సంస్ధలకు స్వాగతం పలుకుతున్నారు.మహేష్ కు మాత్రం తన బడ్జెట్ కు సరపడ నిర్మాతలు దొరకటం,దాదాపు పదేళ్ళకు సరపడ పెట్టుబడులతో ప్రొడ్యూసర్స్ ఉండటంతో ఆసక్తి చూపటం లేదు.ఇక పవన్ పై రిలయన్స్ వారు ఓకే చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

English summary
Pawan Kalyan has vetoed a proposal from Reliance Entertainment to join hands for his upcoming film Shadow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu