»   » ఏమైంది? షూటింగ్ వదిలేసి...పవన్ కళ్యాణ్ సింగపూర్ బాట!

ఏమైంది? షూటింగ్ వదిలేసి...పవన్ కళ్యాణ్ సింగపూర్ బాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు... అనేది ఆయనంటే పడని వాళ్లు, ఆయన్ను విమర్శించే వాళ్లు అనే మాట. తాజాగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ పండగ హాలిడే కూడా తీసుకోకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పాల్గొనడంతో అంతా ఆయన చాలా కమిట్మెంటుతో పని చేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే పవన్ కళ్యాణ్ తాజాగా.... షూటింగ్ పక్కన పెట్టేసి సింగపూర్ ట్రిప్పుకు రెడీ అయ్యారట. సింగిల్ గానే వెలుతున్నట్లు సమాచారం. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సింగపూర్ ఎందుకు వెలుతున్నారు? అనేది మాత్రం బయటకు రాలేదు. యూనిట్ సభ్యులు కూడా ఈ విషయమై మాట్లాడేందుకు ఇష్ట పడటం లేదు. పవన్ కళ్యాణ్ ఏదైనా పర్సనల్ పనిమీద వెలుతున్నారా? రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ కూడా మారినట్లు ప్రచారం జరుగుతోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదల అవుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ....మే నెలలో విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మే 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.


Pawan Kalyan Singapore trip

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఓ సీన్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని.... ఆ సీన్లో అయాన్ నటించాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్ ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

English summary
Latest update reveals that Pawan Kalyan has taken a break from shooting and has headed to Singapore to spend some alone time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu