»   » నిజమే... 'గబ్బర్‌సింగ్‌ 2' కోసం స్వయంగా పవన్

నిజమే... 'గబ్బర్‌సింగ్‌ 2' కోసం స్వయంగా పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'గబ్బర్ సింగ్ 2' విషయంలో పవన్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే ప్రతీ సీన్,డైలాగు ఆయన అక్షరం అక్షరం చూసుకుని మరీ ముందుకు వెళ్తున్నారని ఆ చిత్రం యూనిట్ నుంచి వచ్చిన సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా డైలాగులు రాస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే ఈ లేటు అని చెప్తున్నారు.అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

Pawan Kalyan Start Shooting Gabbar Singh 2?

ఇప్పటికే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ స్క్రిప్టు పనులు ఇంకా పూర్తికాకపోవడంతో కాస్త ఆలస్యమైంది. మార్చి చివరి వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కథని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి యూనిట్ కష్టపడుతోంది. పవన్‌ కల్యాణ్‌ కూడా 'గబ్బర్‌ సింగ్‌2' స్క్రిప్టు పనుల్లో పాలుపంచుకోవటంతో అంతా మరింత భాధ్యతగా పాలుపంచుకుంటున్నారు. కథ అన్నివిధాలా సంతృప్తిగా వచ్చిన తరవాతే సినిమా మొదలుపెట్టాలన్నది ఆయన ఉద్దేశం. మరోవైపు హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. చాలామంది బాలీవుడ్‌ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఎవ్వరినీ ఖరారు చేయలేదు. ఆ సంగతులూ త్వరలో తెలిసే అవకాశం ఉంది.

'నేను ట్రెండు ఫాలో అవ్వను.. సెట్‌ చేస్తా' అంటూ 'గబ్బర్‌సింగ్‌' హంగామా సృష్టించాడు. పవన్‌ కల్యాణ్‌ సంభాషణలు, చేసిన ఫైటింగులు, పాడుకొన్న పాటలూ అన్నీఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. అందుకే ఇప్పుడు రెండో గబ్బర్‌సింగ్‌ ఎప్పుడొస్తాడా?? అని ఎదురుచూస్తున్నారు. 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు.

2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు.

English summary

 Pawan Kalyan has joined hands with director Sampath Nandi for the sequel to his Blockbuster movie Gabbar Singh. The latest buzz in the film nagar is that scripting works of the movie are now at a brisk pace. If everything goes as per plans, the Tollywood's No 1 actor will start shooting for the film Gabbar Singh 2 from April and wrap it up by the end of October 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu