»   » గాయపడ్డారా? పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ అందుకేనా?

గాయపడ్డారా? పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ అందుకేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి హాలిడే కూడా తీసుకోకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి షూటింగుకు బ్రేక్ ఇవ్వడం, సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశం అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల షూటింగులో చిన్నగా గాయపడ్డారని, అందుకే షూటింగుకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్లు గబ్బర్ సింగ్ యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఈ గ్యాపులో రిలాక్స్ అయ్యేందుకే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెలుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే నిర్మాత శరత్ మరార్ మాత్రం....ఈ నెలాఖరు వరకూ కంటిన్యూ షెడ్యూలు షూటింగ్ జరుగుతుందని, వేసవి కాలం మొదలయ్యే సమయంలోనే విడుదల చేస్తామని ట్వీట్ చేసారు. మరి పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

Pawan Kalyan suffers minor injuries

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఓ సీన్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని.... ఆ సీన్లో అయాన్ నటించాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్ ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

English summary
The latest we hear is that Pawan Kalyan has suffered minor injuries while shooting for a crucial sequence in the current schedule which is happening in Hyderabad. Close sources to the unit revealed that the injury is a minor one and Pawan resumed shooting after a short break.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu