Just In
- just now
అల్లరి నరేష్ సినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అన్ని కోట్లు వచ్చాయా..?
- 8 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా వినట్లేదట
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ వరుసగా సినిమాలనైతే ఎనౌన్స్ చేస్తున్నాడు గాని ఇంకా ఒక్క టీజర్ కూడా ఆడియెన్స్ కోసం వదల్లేదు. కరోనా కారణంగా వకీల్ సాబ్ హంగామా వాయిదా పడింది. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దిల్ రాజు కూడా చప్పుడు చేయడం లేదు. వకీల్ సాబ్ అనంతరం వెంటనే మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాతో రెడీ అవ్వాలని అనుకుంటున్నాడు. రానున్న రోజుల్లో పవన్ మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి సమయం చాలానే పడుతుంది. అందుకే ఇటీవల పవన్ హరీష్ శంకర్ కు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాడు. అప్పటిలోపు ఇంకో సినిమా చేసుకోమ్మని కూడా సలహా ఇచ్చాడట. సురేందర్ రెడ్డికి కూడా అలాంటి సలహానే ఇచ్చాడు. అందుకే ఆయన అఖిల్ తో ఒక సినిమా చేసి అనంతరం పవన్ తో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

కానీ హరీష్ శంకర్ మాత్రం ఆ విధంగా చేయడానికి ఏ మాత్రం ఇష్ట పడటం లేదట. నెక్స్ట్ సినిమా చేస్తే పవర్ స్టార్ తోనే చేయలేని మొండిగా డిసిషన్ తీసుకున్నాడట. పవన్ కళ్యాణ్ ఆలస్యం అవ్వవచ్చని చెప్పినప్పటికీ హరీష్ పెద్దగా పట్టించుకోలేదని తన దృష్టి మొత్తం స్క్రిప్ట్ పైనే ఉన్నట్లు సమాధానం ఇస్తున్నాడట.
ఇక హరీష్ పవన్ కోసం సెట్ చేసిన కథ గురించి కొన్ని రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో పవన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. అంతే కాకుండా పవన్ ఆశయాలకు దగ్గరగా ఆ సినిమా ఉంటుందని ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ సినిమాను పవన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.