»   » ఆడియో పంక్షన్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా

ఆడియో పంక్షన్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ..ఓ ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా వచ్చేరంటే ఆ ఊపే వేరు. ముఖ్యంగా ఆయన రావటం హిట్ సెంటిమెంట్ గా కూడా మారింది. ఈ నేపధ్యంలో పవన్ తాజాగా ఓ చిత్రం ఆడియో పంక్షన్ కు వెళ్ళటానికి ఓకే చేసినట్లు సమాచారం. ఆ పంక్షన్ మరేదో కాదు...తన స్నేహితుడు త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న చిత్రానికి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం ఆడియో పంక్షన్ కు రావటానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. . మార్చి 8 న ఈ సినిమా కు సంబంధించిన ఆడియో ను విడుదల చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమంతా, నిత్యామీనన్, అదా శర్మలు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ లు నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు ‘జులాయి'తో అదిరిపోయే పాటలను అందించిన దేవీశ్రీ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్‌ అందించాడని చిత్రబృందం అంటున్నారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' మ్యూజికల్‌ హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు. ఈ చిత్రం మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

Pawan Kalyan to attend S/O Satyamurthy audio release

నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌తో సినిమా రూపొందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభినయం సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. త్వరలో పాటలను విడుదల చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

సింధు తులాని, వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం, రావు రమేశ్‌, ఎమ్మెస్‌ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి. ప్రసాద్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

English summary
Pawan Kalyan is set to attend the audio launch of Allu Arjun’s S/O Satyamurthy, which is due in this weekend.
Please Wait while comments are loading...