»   » దేవుడే దిగివచ్చినా.. త్రివిక్రమ్‌తో పవన్ కల్యాణ్

దేవుడే దిగివచ్చినా.. త్రివిక్రమ్‌తో పవన్ కల్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్రం విడుదల కాకుండానే పవర్ స్టార్ మరో చిత్రానికి సంబంధించిన టైటిల్‌ చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి దేవుడే దిగివచ్చినా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఫిలింనగర్‌‌ టాక్. ప్రస్తుతం కాటమరాయుడు చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరో ప్రాజెక్ట్‌ను వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

మరో బ్లాక్ బస్టర్

మరో బ్లాక్ బస్టర్

టాలీవుడ్‌లో పవన్, త్రివిక్రమ్ కలిసి కేవలం రెండు సినిమాలు చేసినా ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. జల్సా, అత్తారింటికి దారేది కురిపించిన కలెక్షన్లు సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. వీరిద్దరి కలయికలో వచ్చే మూడో సినిమా జల్సా, అత్తారింటికి దారేది బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే టాక్ అప్పుడే మొదలైంది.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా

సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా

దేవుడే దిగివచ్చినా అనే పేరుతో ఈ సినిమా రూపొందుతున్నదన్న నేపథ్యంలో ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో కనిపించనున్నాడట. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను సిద్ధం చేస్తున్నరట.

ప్రత్యేకంగా సెట్ డిజైన్

ప్రత్యేకంగా సెట్ డిజైన్

ఎండలను తట్టుకొనే విధంగా సెట్ మొత్తం చల్లగా ఉండేలా దానిని తయారు చేయిస్తున్నట్టు టాక్. కళా దర్శకుడు ఏఎస్ ప్రకాశ్ పర్యవేక్షణలో ఈ సినిమా సెట్ సిద్ధమవుతున్నది. మార్చి 25 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నదనే వార్త వినిపిస్తున్నది.

కీర్తీ సురేశ్, అను ఇమాన్యూయేల్

కీర్తీ సురేశ్, అను ఇమాన్యూయేల్

హారిక అండ్ హాసని బేనర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జంటగా కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యూల్ లు కథానాయికలుగా నటించనున్నారు. సీనియర్ నటి ఖుష్బూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.

English summary
Power Star Pawan Kalyan, Trivikram Srinivas next movie title is now talk of town. Devude digivachchina title under consideration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu