»   » మునపటి క్రేజ్ కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్...!?

మునపటి క్రేజ్ కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్...!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రాబోయే పవన్‌కల్యాణ్ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. వెబ్‌మీడియా చాలా పేర్లు క్రియేట్ చేసినప్పటికి వాటిని నిర్మాత ఖండిస్తూ వచ్చారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా గెడ్డం పెంచి మరీ నటిస్తున్నారు. పవన్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా విష్ణువర్థన్ ఈ చిత్రంలో మసాలా అంశాలని జోడిస్తున్నాడు. ఈ గెటప్ లో ఫోటోలు కూడా వచ్చాయి కానీ ఆఫీయల్ గెటప్ మాత్రం రాలేదు.

  ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలంటే యూత్ లో బాగా క్రేజ్ వుండేది. ముఖ్యంగా అమ్మాయిలు పవన్ కళ్యాణ్ స్టైల్ ని, అతని బాడీ లాంగ్వేజ్ ని బాగా ఇష్టపడేవారు. దానికి తగ్గట్టుగానే అబ్బాయిలు కూడా పవన్ స్టైల్ ని ఫాలో అయ్యేవారు. 'జల్సా" వరకు పవన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ వుండేది. ఆ తర్వాత పవన్ ప్రజారాజ్యం పార్టీలో చేరి, యురాజ్యం అధినేతగా మారి ఎన్నికల్లో విపరీతమైన ప్రచారం చేశాడు. ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోవడం, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం వంటి పరిణామాలవల్ల పవన్ ఇమేజ్ దెబ్బతింది.

  యూత్ లో క్రమేణా క్రేజ్ తగ్గతూ వచ్చింది. ఎలక్షన్స్ తర్వాత వచ్చిన 'కొమరం పులి" ఘోరంగా ప్లాప్ కావడం, తను ఎంతో ఇష్టపడిన చేసిన 'తీన్ మార్" కూడా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో పవన్ కళ్యాణ్ లో ఆలోచనలో పడ్డాడు. యూత్ లో తను కోల్పోయిన క్రేజ్ ని మళ్ళీ రాబట్టుకోవాలన్న పట్టుదలతో ఇప్పుడు విష్ణవర్థన్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రెస్టీజియస్ గా భావిస్తున్నాడు. ఈ సినిమా తనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాడు. మరి పవన్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

  English summary
  Pawan Kalyan’s upcoming film under Vishnuvardhan direction has completed talkie part shooting. The film’s shoot is almost done except for a song to be shot on Pawan Kalyan. Post Production work started today. Spot dubbing is not used for this film as it was miserably failed in Teen Maar. Regular dubbing will start in October. Sarah Jane Dias and Anjali Lavania are paired up with Pawan Kalyan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more