Just In
- 6 min ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
- 8 min ago
‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- 23 min ago
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- 34 min ago
పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!
Don't Miss!
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Automobiles
కస్టమర్ల ఇంటి వద్దకే డీజిల్ డెలివరీ; ఐడియా బాగుంది కదూ..!
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘వకీల్ సాబ్’ విడుదలకు డేట్ ఫిక్స్
సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సాధారణంగా కమ్‌బ్యాక్ మూవీ అంటే ఏ రేంజ్ ఎలివేషన్ ఉన్న కథలను ఎంచుకుంటారు కానీ.. ఈ మెగా హీరో మాత్రం బాలీవుడ్‌లో వచ్చిన 'పింక్' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా దాని ప్రభావం సినిమా విడుదలపై పడింది. దీంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగులు పున: ప్రారంభం అయ్యాయి. దీంతో 'వకీల్ సాబ్' కూడా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కల్యాన్ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'వకీల్ సాబ్'ను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకోసం వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, 'వకీల్ సాబ్' మూవీ టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31నే విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్ పాత్రను పోషిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా కోసం మొత్తం మూడు గెటప్‌లలో అతడు కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుండగా... నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలను పోషిస్తున్నారు.