twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెమెరామెన్‌ గంగతో రాంబాబు' రన్ టైమ్ తక్కువ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. పవన్‌కల్యాణ్‌, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం టైటిల్ పెద్దదైనా లెంగ్త్ పరంగా చిన్నదే అంటున్నారు. పన్నెండు రీళ్లు ఉన్న ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 10 నిముషాలు మాత్రమే అని తెలుస్తోంది. రీసెంట్ వచ్చిన రెబెల్ చిత్రం రెండు గంటల 50 నిముషాలు, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం కూడా లెంగ్త్ ఎక్కువే. ఈ చిత్రాలు విడుదల అయ్యాక ట్రిమ్ చేసారు.

    ఇక 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' లో గాబ్రియేలా ఓ గీతంలో నర్తించింది. అది సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు. ఈ చిత్రం గురించి పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ... ''పవన్‌కల్యాణ్‌ సినిమాల స్థాయి కొలవడానికి 'గబ్బర్‌సింగ్‌' విజయమే ఓ కొలమానమైతే.. అందుకు ఓ మెట్టుపైనే 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా ఉంటుంది'' అన్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    ''ఓ జర్నలిస్ట్‌కీ, ఓ రాజకీయనాయకునికీ మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను రాంబాబు ఎలా పారద్రోలాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.. చాలా సీరియస్ మోడ్‌లో సినిమా నడుస్తుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. మీడియాపై జోక్స్ ఉన్నా అవి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉండవు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ ఇచ్చిన రీ-రికార్డింగ్‌లో చిన్న కరెక్షన్ కూడా చేయలేదు. పవన్ ఎంతో మురిసిపోతూ డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది'' అని చెప్పారు పూరి జగన్నాథ్.

    'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ సినిమా అంటే అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఆ అంచనాలకు మించిన రేంజ్‌లో ఉంటుందీ సినిమా. తొలిప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్ చిత్రాలను నైజాం ప్రాంతానికి విడుదల చేసిన తానే.. 'కెమెరామెన్ గంగతో రాంబాబు'ను కూడా విడుదల చేస్తున్నాను '' అని దిల్ రాజు చెప్పారు. మరో రెండు రోజుల్లో సెన్సార్ పూర్తవుతుందని, ఈ నెల 18న సినిమాను విడుదల చేస్తామని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు.

    English summary
    Puri Jagannadh upcoming flick ‘Cameraman Gangatho Rambabu’ is heard to have made with 12 reels and its run time is just 2 hours and 10 minutes. Milky beauty Tamannah has shared the screen space with pawan Kalyan in this message oriented mass entertainer. Manisharma scored the music of this film. The movie was produced by DVV Danayya on the banner Universal Media. The movie is hitting the screens on 18th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X