»   » 'సర్దార్' రిలీజ్ డేట్ అందుకే లాక్

'సర్దార్' రిలీజ్ డేట్ అందుకే లాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏ సినిమా బిజినెస్ అయినా కనీసం రిలీజ్ కు ముందు ఒక నెల నుండే ప్రారంబిస్తారు. కాని పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం సినిమా ప్రారంభం నుంచీ బిజినెస్ కోసం ట్రేడ్ వర్గాల్లో హడావిడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కు అలాంటి పరిస్దితే ఉంది. ఈ సినిమా కోసం బయ్యర్లు వెంట పడుతున్నారు. కాని మొదటే ఈ సినిమా బిజినెస్ చేయకుండా క్రేజ్ వచ్చేదాకా ఆగారు. అయితే ఇటీవల..బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకోవాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసి ట్రేడ్ వర్గాలకు తెలియచేసినట్లు తెలుస్తోంది.

గాయత్రి ఫిల్మ్ వారు, ఉత్తరాంధ్ర కు సంబందించిన రైట్స్ ని ఇప్పటికే చాలా పెద్ద మొత్తం వెచ్చించి తీసుకున్నట్లు సమచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించి షూటింగ్ ఈనెల 5వ తారీకు నుండి హైదరాబాద్ లోనే, కంటిన్యూగా 27 రోజులపాటు జరగనుంది. దీనితో 70 శాతం సినిమా పుర్తవుతుందని సమాచారం.


Pawan's Sardaar Gabbar Singh Business Started

కాజల్ అగర్వాల్ పాల్గోనున్న ఈ షూటింగ్ లో సినిమాకు సంబందించిన కొన్ని సీన్స్, పాటలు హైదరాబాద్ లోనే తీయాలని ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మెన్నటి వరకు గుజరాత్ లోని వడోదరాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నసంగతి తెలిసిందే.


‘సర్దార్ గబ్బర్‌సింగ్' అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కాకపోతే షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా,ఇప్పుడు మాత్రం సమ్మర్ కంటే ముందే అంటే ఏప్రిల్ 8, 2016లో విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరక్టర్ బాబీ. ఈ సినిమా తర్వాత పవన్ దాసరి నిర్మాణంలో నటించనున్నారని సమాచారం.

English summary
Gayatri films has acquired the Sardaar Gabbar Singh film's Uttarandhra rights for undisclosed but a whopping price.
Please Wait while comments are loading...