»   » పవన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడా?

పవన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాన్నకు ప్రేమతో. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో రన్ అవుతుండగా, ఇటీవల ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసినట్లు తెలుస్తోంది. తన చిత్రం సర్ధార్ పనులతో బిజీగా ఉన్నా కూడా, టైం చూసుకొని మరి నాన్నకు ప్రేమతో చిత్ర స్పెషల్ షోను చూసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అలాగే క్లైమాక్స్‌ను చూసి తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాక సినిమాను ఎంతో ఇంట్రెస్ట్‌తో చూసిన పవన్ కళ్యాణ్...ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్‌ల ఎమోషనల్ పర్‌పార్మెన్స్‌పై ప్రశంసలు కురిపించినట్టు సమాచారం. సుకుమార్ టాలెంట్‌ను, ఆయన క్రియేటివ్ వర్క్‌ను కూడా పవన్ పొగిడినట్టు టాక్.. అయితే ఈ విషయమై అధికారికంగా వార్త ఏమీ లేదు.


Pawan turns emotional over Nannaku Prematho

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


Pawan turns emotional over Nannaku Prematho

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
According to the latest reports, Pawan Kalyan has recently watched Jr NTR's Nannaku Prematho and burst in tears after watching the climax scene as it made him remember his own father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu