»   » చిరంజీవి నిర్ణయం..పవన్ అప్ సెట్?

చిరంజీవి నిర్ణయం..పవన్ అప్ సెట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు గాసిప్ సర్కిల్స్ లో ఎక్కువగా వినపడుతోంది ఏంటీ అంటే పవన్ కళ్యాణ్ అప్ సెట్ అయ్యారని. ఎందుకూ అంటే చిరంజీవి నిర్ణయంతో అని. చిరంజీవి తాను బీజేపీలో చేరటం అని ప్రకటించటంతో అని చెప్పుకుంటున్నారు.

వాళ్లు చెప్పుకునేదేమిటీ అంటే పవన్ కళ్యాణ్..స్వయంగా బీజేపీకు, చిరంజీవి కు మధ్య డీల్ సెట్ చేసారని, ఆయన్ను బీజేపిలోకి ఆహ్వానించాలి అనుకున్నారని...అయితే ఇప్పుడు చిరంజీవి తాను కాంగ్రేస్ లో కొనసాగుతాను అని తేల్చి చెప్పేయటం ఆయన ఊహించలేదని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.

Pawan very disappointed with Chiranjeevi!

పవన్ కళ్యాణ్ ...ఏమీ బిజేపీ కు బ్రాండ్ అంబాసిడర్ కాదు. అలాగే కార్యవర్గ సభ్యుడు కాదు..కీలకమైన పోస్ట్ లోనూ లేరు. కేవలం సపోర్ట్ చేసారు అంతే. స్వయంగా పవన్ కు జనసేన అనే పార్టీ ఉంది. అంతగా తన అన్నను పిలవాలి అనుకుంటే కాంగ్రేస్ ని వదిలి జనసేనలోకి రమ్మంటాడు కానీ..ఇలా బీజేపీలోకి చేరు, తెలుగుదేశంలోకి రా అని అనరు అని పవన్ అభిమానులు అంటున్నారు.

ఈ రూమర్ పుట్టడానికి కారణం..చిరంజీవి, పవన్ కొంతకాలంగా క్లోజ్ గా ఉంటున్నారు. బ్రూస్ లీ రిలీజ్ అయిన తర్వాత పవన్ వెళ్లి స్వయంగా చిరంజీవిని కలిసారు. అలాగే చిరంజీవి వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో చిరంజీవిని కలిసారు.

English summary
Chiranjeevi announced that he will stay in Congress as long as he is in politics and there is no thought of changing party. This announcement disappointed Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu