»   » పవన్, దర్శకుడు విష్ణు వర్ధన్ కాంబినేషన్ టైటిల్ ఏమిటంటే...

పవన్, దర్శకుడు విష్ణు వర్ధన్ కాంబినేషన్ టైటిల్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ది షాడో అనే టైటిల్ ని పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్ పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అబ్బూరి రవి సంభాషణలన్నీ రాశాడు. ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరిని ఇప్పటికే ఎంపిక చేశారు. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక గతంలో విష్ణు వర్ధన్ అజిత్ తో చేసిన భిళ్ళా చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోకి సైతం ప్రభాస్ తో రీమేక్ అయింది. ఇప్పుడా చిత్రం ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి ఫైట్స్: శ్యామ్ కౌశల్, రచన: రాహుల్ కోడా, కెమెరా: టి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీహరి ప్రసాద్, నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, యార్లగడ్డ శోభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu