»   » పవన్ కళ్యాణ్-రత్నం మధ్య ఒప్పందం నిజమేనా?

పవన్ కళ్యాణ్-రత్నం మధ్య ఒప్పందం నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ కళ్యాణ్ త్వరలో 'ఖుషి' చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నంతో కలిసి మరోసారి పని చేయబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను కమిటైన ఎస్.జె సూర్య దర్శకత్వంల ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయనకు డేట్స్ ఇచ్చేందుకు సిద్దమయినట్లు సమాచారం.

అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ 'వీరమ్' రీమేక్ రైట్స్ పొందడంలో పవన్ కళ్యాణ్ కు రత్నం చాలా పెద్ద హెల్పే చేసాడట. అందుకు ప్రతి ఫలంగానే పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా ఆయనతో చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏ.ఎం.రత్నం పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కూడా తమిళ రీమేకే అని అంటున్నారు. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాలమ్' చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేస్తే తెలుగులో మంచి సక్సెస్ అవుతుందని ఏ.ఎం.రత్నం భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఒక అండర్ స్టాండిగుకు వచ్చినట్లు టాక్.

Pawan would work with A.M Rathnam

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'వీరమ్' రీమేకే అని టాక్. అయితే స్టోరీని మక్కికి మక్కి దించకుండా మార్పులు చేసినట్లు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగిన విధంగా డైలాగ్స్ రాసారట.

ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాతగా ఉన్న ఎ.ఎం.రత్నం తర్వాత కొన్ని సినిమాలు ప్లాపు కావడంతో చాలా నష్టపోయారు. దీంతో చాలా కాలం ఆయన సొనిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇటీవలే ఫైనాన్షియల్ గా కోలుకున్న ఆయన తమిళంలో మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

English summary
Pawan would work with A.M Rathnam once he's free from his present commitment with director SJ Suryah. Apparently, Rathnam has helped Pawan for acquiring remake rights of Ajith's Veeram and this is said to be reason behind Pawan giving nod for Rathnam's next which is Vedalam remake. This is reportedly an understanding between the duo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu