For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్,రామ్ చరణ్ మ్యాటర్ నిజమేనా?(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెర వెనుక రామ్ చరణ్,ఎన్టీఆర్ మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో వీరి స్నేహ బంధాన్ని అడ్డం పెట్టుకునో మరేమో గానీ ఓ రూమర్ లాంటి వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే...రామ్ చరణ్ తాజా చిత్రం నాయక్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడని...అయితే ఈ విషయమై ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, దర్శకుడు వినాయిక్ కానీ పెదవి విప్పటం లేదు.

  ఎన్టీఆర్,వివి వినాయిక్ ల స్నేహ బంధం దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ గెస్ట్ గా మెరిసే అవకాసం ఉందని చెప్తున్నారు. గతంలోనూ ఎన్టీఆర్...వెంకటేష్..చింతకాయల రవి చిత్రంలో అలా కనపడి ఓ రెండు స్టెప్స్ వేసి మురిపించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సాంగ్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అంతేగాక హీరోల మధ్య ఉన్న రిలేషన్స్ కు ఇదే ఉదాహరణ అంటూ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.

  ఇప్పుడు నాయక్ లో నిజంగా ఎన్టీఆర్ కనిపించటం జరిగితే ఇటు మెగాభిమాలు ఎలాగూ..ఈ చిత్రానికి వస్తారు..వారితో పాటు నందమూరి అభిమానులు సైతం వచ్చే అవకాసం ఉంది. సంక్రాతికి ఎలాగూ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ లేదు కాబట్టి సంక్రాతికి అలా వెండితెరపై కనిపించి సెంటిమెంట్ ని కంటిన్యూ చేసినట్లు ఉంటుంది కాబట్టి చేసే ఉండచ్చు అంటున్నారు. ఈ నేఫధ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఉన్న ఆత్మీయానుభందాన్ని గుర్తు చేసే ఫోటోలను ఓ సారి తిరగేద్ధాం....

  నందమూరి,మెగా అభిమానులు మధ్య చాలా వైరం ఉండవచ్చు..కానీ రామ్ చరణ్,ఎన్టీఆర్ మాత్రం చాలా మంచి ప్రెండ్స్. వీరిద్దరూ తమ కుటుంబ పంక్షన్స్ కు హాజరవటమే కాకుండా బయిట కూడా పర్శనల్ గా కలుస్తూంటారు.

  రామ్ చరణ్ రీసెంట్ గా ఎన్టీఆర్ బాద్షా ఓపినింగ్ కు వచ్చి అందరినీి ఆనందపరిచారు. ఎన్టీఆర్ పై క్లాప్ బోర్డ్ కొట్టారు.

  బాద్షా ముహూర్తం సమయంలో ఎన్టీఆర్ సొంత కారులో రామ్ చరణ్ వచ్చి శుభాకాంక్షలు తెలియచేయటం పరిశ్రమ స్నేహపూర్వక వాతావరణానికి నిదర్శనం.

  బాద్షా ముహూర్తం సమయంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ అనుబంధం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.

  ఈ ఇద్దరి హీరోలకు వారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన అసలైన హీరో రాజమౌళి సాక్షిగా..వీరి స్నేహ బంధం...

  ఇద్దరూ కలిసి ఐపియల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు...

  తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి...ఎన్టీఆర్ వివాహానికి హాజరైన రామ్ చరణ్ తేజ...

  ఇవన్నీ చూసాక వీరిద్దరూ కలిసి ఓ మల్టిస్టారర్ ఫిల్మ్ చేస్తే బావుంటుంది అనిపిస్తోంది కదూ... ఏమో భవిష్యత్ లో చేస్తేరేమో... ఇద్దరూ కలిసి చెయ్యాలంటే దానికి సరపడ బడ్జెట్...బిజినెస్ అవసరం..అంత పెట్టగల నిర్మాత దొరికి వీరిద్దరిని ఒప్పించే కథ దొరికితే పండుగే...
  అప్పటిదాకా ఇలా గెస్ట్ రోల్స్ తోనే సరిపెట్టుకోవాలి.

  రామ్‌ చరణ్‌ సరసన కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న నాయక్ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్‌ చేశారు. రామ్‌చరణ్‌, అమలాపాల్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కించారు. జనవరి 9న సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు. ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌ సాయి. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం : తమన్.

  English summary
  Director VV Vinayak's next directorial venture Naayak starring Ram Charan, Kajal Aggarwal and Amala Paul in leads, is one of the most-awaited films in Telugu. The movie is turning bigger and better as it nears its release date. The latest we hear about it is that Junior NTR and Megastar Chiranjeevi are making a cameo appearance in this much-talked about flick, which is a good news for both Mega and Nandamuri fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X