»   »  పిజెఆర్ కుమారుడి ఢిల్లీ ప్రయాణం రద్దు!?

పిజెఆర్ కుమారుడి ఢిల్లీ ప్రయాణం రద్దు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల రహస్య ప్రేమ పెళ్లి వెనకాల తను ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి తన న్యూఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కోశాధికారి. ఆ పదవిలో ఉండడం మూలానా ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిఉంది. విష్ణు ఢిల్లీకి వెళ్లాల్సిఉన్న రోజుకు ముందు రోజే శ్రీజ-శిరీష్ ఢిల్లీ హైకోర్టులో ప్రత్యక్షమవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వస్తున్న ఆరోపణనలకు తన ఢిల్లీ పర్యటన మరింత బలం చేకూర్చవచ్చనే భయంతోనే విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X