twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ మూవీకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

    ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు యావరేజ్ గా రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30% వాటా తీసుకోవ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ బిజినెస్ అనే అంచనాలతో ఉంటుంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తే టాలీవుడ్లో బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా బిగ్గెస్ట్ సినిమా రూపాంతరం చెందుతుంది.

    జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారీ హిట్ సినిమాల తర్వాత మూడోసారి పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది చివర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    రూ. 150 కోట్ల బిజినెస్ అంచనాలు

    రూ. 150 కోట్ల బిజినెస్ అంచనాలు

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని ఏరియాలు కలిపి థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

    ప్రొడక్షన్ ఖర్చు

    ప్రొడక్షన్ ఖర్చు

    ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండానే ప్రొడక్షన్ కాస్ట్ రూ. 75 కోట్లు వరకు అవుతుందట. త్రివిక్రమ్ తాను అనుకున్న విధంగా లావిష్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడని,అందుకు ఇంత ఖర్చు అని టాక్.

    పవన్ రెమ్యూనరేషన్ ఎంత?

    పవన్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు యావరేజ్ గా రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30% వాటా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు నుండి 170 కోట్లు జరిగితే అందులో కనీసం 45 నుండి 50 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ గా అందనుంది.

    షూటింగ్ మొదలైంది

    షూటింగ్ మొదలైంది

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సినిమా ఏప్రిల్ 3 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు.

    ఫిల్మ్ సిటీ

    ఫిల్మ్ సిటీ

    తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే 5 రోజుల పాటు సాగింది. తర్వాతి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం హాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకంలో ఉన్నారు అభిమానులు.

    అక్టోబర్లో సినిమా

    అక్టోబర్లో సినిమా

    హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    The much-awaited third film of Pawan Kalyan and director Trivikram has begun its regular shoot on April 3rd in Hyderabad. The trade is abuzz with the assumptions of pre-business and the quote estimations have reached upto 150 crores. The production cost of the movie is nearly 75 crores, excluding remuneration of Pawan Kalyan. The actor is apparently being paid a sum of 30 crores for the movie. On the other hand, Trivikram decided to take profit sharing of upto 30% from the pre-business profits as per the reliable sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X