»   » బాహుబలి పేరు చెప్పి పూజా హెడ్గేను బకరా చేశారట?

బాహుబలి పేరు చెప్పి పూజా హెడ్గేను బకరా చేశారట?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కన్నడ బ్యూటీ పూజా హెగ్డే నటించిన 'సాక్ష్యం' మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం దక్కించుకుని దూసుకెళుతున్న తరుణంలో 'సాక్ష్యం' లాంటి పరాజయం పూజా కెరీర్‌కు మైనస్ అయిందనే వాదన సైతం వినిపిస్తోంది.

  సినిమా హిట్టయితే వార్తలు మరోలా ఉండేవేమో కానీ... సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడటంతో ఇపుడు పూజాకు సపోర్ట్ ఇచ్చే విధంగా కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. నిర్మాతలు ఆమెకు మాయమాటలు చెప్పి 'సాక్ష్యం' సినిమాకు సైన్ చేసేలా చేశారని ఆ వార్తల సారాంశం.

   బాహుబలి పేరు చెప్పి బకరా చేశారట

  బాహుబలి పేరు చెప్పి బకరా చేశారట

  ‘సాక్ష్యం' సినిమా కోసం ఆమెను సంప్రదించినపుడు ఈ చిత్రం ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని మాయమాటలు చెప్పారట. మరి వాళ్లు నిజంగా అలా చెప్పారో? లేదో? తెలియదు కానీ.... ఒక వేళ చెప్పినా ఈవిడ ఎలా నమ్మిందో మరి?

   పూజా లుక్ అందంగా లేక పోవడానికి కారణం

  పూజా లుక్ అందంగా లేక పోవడానికి కారణం

  దాంతో పాటు ‘సాక్ష్యం' మూవీలో పూజా లుక్ అందంగా లేక పోవడానికి కారణం.... తన లుక్ పట్ల దర్శక నిర్మాతలు సరైన కేర్ తీసుకోలేదని, అందుకే తాను గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అంత గ్లామరస్‌గా కనిపించలేదని పూజా తన సన్నిహితులతో అంటోందట.

  ప్రమోషన్లలో నవ్వుతూ మాట్లాడిందే...

  ప్రమోషన్లలో నవ్వుతూ మాట్లాడిందే...

  ఈ గాసిప్స్ సంగతి అలా ఉంచితే..... ఇటీవల ‘సాక్ష్యం' ప్రమోషన్లలో పూజా హెగ్డే నవ్వుతూ కనిపించింది. అంత సంతోషంగా ఆవిడ కనిపిస్తే మరి ఈ రూమర్స్ ప్రచారంలోకి ఎలా వచ్చాయో?

  పూజా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్

  పూజా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్

  ప్రస్తుతం పూజా హెడ్గే కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్ మహేష్ బాబు 25వ సినిమా రూపంలో వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె దశ తిరుగుతందో? లేదో? చూడాలి. దీంతో పాటు హౌస్‌ఫుల్ 4 అనే హిందీ మూవీలో కూడా పూజా నటిస్తోంది.

  English summary
  Film nagar buzz is that, Pooja Hegde upset with Saakshyam team. She recently starred in Bellamkonda Srinivas’s Saakshyam movie which turned out to be a disaster at the box office. Pooja hasn’t shown much interest in the film and was thinking to reject it. But the makers of film pressurized her saying that they will pay huge remuneration and as it is a different concept it will definitely connect well with the audience.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more