Prabhas Adipurush: 35 వేల షోస్​తో ఆది పురుష్​ రిలీజ్ ప్లాన్​!

దర్శక దిగ్గజం జక్కన్న తెరకెక్కించిన బాహుబాలి సినిమాతో పాన్​ ఇండియా స్టార్​ స్థాయికి చేరుకున్నాడు రెబల్​ స్టార్ ప్రభాస్. తెలుగు హీరోల్లో ఏ కథానాయకుడు చేరుకోని రేంజ్​కు ఎదిగాడు. అనంతరం వచ్చిన బాహుబలి ది కంక్లూజన్​ సైతం రికార్డుల మోత మోగించింది. భారతీయ చలన చిత్రానికి ఉన్న సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. దీంతో ప్రభాస్​ స్థానం ఆకాశాన్నింటింది. అయితే తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్​ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. సాహోకు కలెక్షన్లు వచ్చిన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక రాధేశ్యామ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్, సినీ లోకం కన్ను ఆది పురుష్​పైనే ఉంది.

 తగ్గని క్రేజ్​..

తగ్గని క్రేజ్​..

బాహుబలి మూవీ సిరీస్​తో వరల్డ్​వైడ్​గా స్టార్​డమ్​ సంపాదించుకున్న ప్రభాస్​కు సాహో, రాధేశ్యామ్​తో పరాజయం పాలయ్యాడు. అయితే ప్రభాస్​కు ఉన్న క్రేజ్​ ఏ మాత్రం తగ్గలేదు. రెండు సినిమాలు ఫెయిల్ అయిన సరే వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్​ కంప్లీట్​ చేసుకున్న ఆది పురుష్​ మూవీ వచ్చే ఏడాది రానున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి కానుకగా..

సంక్రాంతి కానుకగా..

ఇవి కాకుండా ప్రాజెక్ట్ కె, సలార్​ వంటి పెద్ద సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు తాజాగా ఆది పురుష్​ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్​చల్ చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆది పురుష్​ను విడుదల చేస్తున్నట్లుగా ఇదివరకే మూవీ యూనిట్​ ప్రకటించిన విషయం తెలిసిందే.

 9500 స్క్రీన్స్​..

9500 స్క్రీన్స్​..

అయితే ఈ ఆది పురుష్​ మూవీని వీలైనన్నీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారని టాక్​ వినిపిస్తోంది. ఇండియా మొత్తం మీద థియేటర్లు, స్క్రీన్స్​ అన్నింటిని కలుపుకుని సుమారు 9500 ఉన్నాయని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్​ స్క్రీన్​ థియేటర్లు. మిగతావి మల్టీఫ్లెక్స్​ స్క్రీన్​లు. గతంలో పదివేలకు పైగ ఉన్నా.. కరోనా కారణంగా కొన్ని సింగిల్ స్క్రీన్​లను గోడౌన్​, షాపింగ్​ కాంప్లెక్స్​లుగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న వాటిలో వీలైనన్నీ స్క్రీన్​లలో ఆది పురుష్ సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.

35 వేల కంటే ఎక్కువగా..

35 వేల కంటే ఎక్కువగా..

ఒక్కో థియేటర్​లో రోజుకు నాలుగు ఆటలు వేస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలా చూసుకుంటే రోజుకు 40 వేల షోలు వేయొచ్చు. వెయ్యి, 1500 థియేటర్లు వేరే సినిమాలకు ఇచ్చేసినా.. 8 వేల థియేటర్లలో ఆది పురుష్ విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో 4 షోలు, మరికొన్నింటిలో 5 షోలు వేస్తే.. రోజుకు సుమారు 35 వేల కంటే ఎక్కువ షోస్​ పడే అవకాశం ఉందని టాలీవుడ్​ ఇన్​సైడ్​ టాక్​.

సరికొత్త రికార్డు..

సరికొత్త రికార్డు..

దీంతో ప్రభాస్​ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాకుండా ఈ రికార్డులను మరొకరు అందుకోవడం కూడా కష్టమే. ఇక సాహో, రాధేశ్యామ్​కు ఆశించిన విజయం రాకపోవడంతో ఆది పురుష్​ తో ప్రభాస్ గ్రాండ్​ రీ ఎంట్రీ ఇస్తాడని ఆశిస్తున్నారు.

 బీజేపీ అండ..

బీజేపీ అండ..

ఇక ఇదిలా ఉంటే ఆది పురుష్​ మూవీ రాముడి కథతో రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్​ అలీ ఖాన్, సీతగా కృతి సనన్​ నటించనున్నారు. హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో పరోక్షంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకారాలు ఉండవచ్చని అంచనా వేయవచ్చు. ది కశ్మీర్ ఫైల్స్​, కార్తికేయ 2 సినిమాలకు నార్త్​లో ఆర్​ఎస్​ఎస్​ నుంచి సహాయం లభించిందని టాక్​. సో.. ఇలా శ్రీరామునిపై తీస్తున్న సినిమా ఆది పురుష్​ కావడంతో మంచి సపోర్ట్​ లభించవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X