»   » ప్రభాస్-అనుష్క మౌనం.... పెళ్లి జరిగేది అక్కడే అంటూ తాజాగా మరొకటి?

ప్రభాస్-అనుష్క మౌనం.... పెళ్లి జరిగేది అక్కడే అంటూ తాజాగా మరొకటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టులో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క ప్రేమలో పడ్డారని, బాహుబలి లాంగ్ జర్నీలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇద్దరూ వయసు పరంగా, ఫిజిక్ పరంగా ఈడు జోడు సూపర్ గా ఉండటం కూడా ఇద్దరికీ కలిసొచ్చే అంశమే. మరో వైపు అభిమానుల నుండి కూడా వీరు పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మౌనం... రూమర్లకు బలం

మౌనం... రూమర్లకు బలం

అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారనే విషయం అఫీషియల్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇది రూమర్ గానే ఉంది. ఒక వేళ ఇది రూమర్ అయితే ప్రభాస్ గానీ, అనుష్క గానీ ఇప్పటికే ఖండించాల్సింది. ఈ రూమర్లపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో.... ఇది నిజమే అని అనుకుంటున్నారంతా.


మాహిష్మతి సెట్టింగులో వివాహం?

మాహిష్మతి సెట్టింగులో వివాహం?

కాగా.... బాహుబలి సినిమా కోసం వేసిన మాహిష్మతి సెట్టింగ్స్ లోనే ప్రభాస్-అనుష్క వివాహం జరుగబోతోంది అంటూ తాజాగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ మాసంలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందట. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


అనుష్క పూజలు

అనుష్క పూజలు

అనుష్క ఇటీవల కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. హంగు, ఆర్భాటం లేకుండా సాధారణ భక్తుల మాదిరిగానే పూజలు నిర్వహించారు. వీఐపీ సందర్శకుల మాదిరిగా కాకుండా సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ లైనులోనే వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజారులు అనుష్క కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు.


పూజలపై అనుష్క తండ్రి

పూజలపై అనుష్క తండ్రి

అనుష్క పెళ్లి కోసం పూజలు నిర్వహించందంటూ వస్తున్న వార్తలను అనుష్క తండ్రి విఠల్ శెట్టి ఖండించారు. అనుష్కకు అమ్మవారి భక్తి ఎక్కువ. రజనీకాంత్‌ ‘లింగ' షూటింగ్‌ సమయంలోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి' సక్సెస్‌ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది అని అనుష్క తండ్రి విఠల్‌ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా ఇటీవల అనుష్క సందర్శించారు.English summary
There have been many rumours linking up Anushka with Prabhas. Most recently too a rumour was heard that the two decided to marry. The rumours gained strength as neither Rebel Star Prabhas nor Anushka condemned the reports and latest is that the two are going to wed this December and that their wedding will be in Baahubali theme with Mahishmati settings!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu