»   » ప్రభాస్ ఛీప్ గెస్ట్ గా వస్తున్నాడు

ప్రభాస్ ఛీప్ గెస్ట్ గా వస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లోఫర్‌'. ఇది వరుణ్‌ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ డిసెంబర్ 8న జరగనుంది. శిల్ప కళా వేదికలో భారీగా జరగనున్న ఈ వేడుకకు ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌ తొలిసారి చేస్తున్న మాస్‌ సినిమా ఇది. యాక్షన్‌తో పాటు, సెంటిమెంట్‌కీ ప్రాధాన్యం ఉంది. కథానుసారమే టైటిల్‌ నిర్ణయించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.


Prabhas As Chief Guest for Puri's Loafer

బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్‌ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌ తదితరులు నటించారు. సంగీతం: సునీల్‌ కశ్యప్‌. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.

English summary
Prabhas will be the chief guest at the audio launch event of Varun Tej’s forthcoming film “Loafer”. The audio launch function will take place on December 8th at Shilpa Kala Vedika in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu