Don't Miss!
- Sports
సూర్యకుమార్ యాదవ్‌కు అరుదైన అవార్డు!
- News
మా నాయకుడు `గ్లామరస్ హీరో`: పవన్ కల్యాణ్‌ను సోము వీర్రాజు తిట్టారా? పొగిడారా?..!!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Prabhas Project K రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే.. లిస్ట్ లో మరో ప్లాన్ కూడా?
నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే అతని సినిమాల్లో అందరి ఫోకస్ ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్ ప్రాజెక్ట్ K పైనే ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత సి.అశ్వినీ దత్ అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చారు. ప్లాన్ ప్రకారం ఒక ఫెస్టివల్ రెండు ఫెస్టివల్ డేట్స్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా చేదు అనుభవాలు
బాహుబలి సినిమా తర్వాత అతిపెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న ప్రభాస్ గత రెండు సినిమాలతో ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. యాక్షన్ సినిమాగా వచ్చిన సాహూతో పాటు లవ్ స్టోరీ రాధే శ్యామ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచే విధంగా కలెక్షన్స్ అందుకుంది. దీంతో అభిమానులు ప్రభాస్ తదుపరి సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆ సినిమాల తరువాత
ఇక ప్రభాస్ లైనప్ లో మరో యాక్షన్ సినిమా సలార్ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే సంక్రాంతికి ఆదిపురుష్ సినిమ విడుదల కానుంది. ఈ సినిమా రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు సినిమాల అనంతరం అంతకంటే హై బడ్జెట్లో సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్ ప్రాజెక్ట్ K రానుంది. మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలలో ఆకాశాన్ని దాటేశాయి.

500 కోట్ల బడ్జెట్
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల అనుభవం ఉన్న నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సీఎంను నిర్మిస్తున్నారు. ఇక కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో కూడా ప్రాజెక్ట్ K ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. హాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నట్లు గతంలోనే నిర్మాత క్లారిటీ ఇచ్చారు

ఆ ఫెస్టివల్ టార్గెట్
ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో కూడా ఎన్నో రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా అశ్వినీ దత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే సినిమాను 2023 అక్టోబర్ 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. దసరా సమయంలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమాకు తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయి అని అదే తేదీ బెస్ట్ అని అనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది.

మరొక డేట్ కూడా..
అలాగే నిర్మాణా సంస్థ మరొక డేట్ పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా ఈజీగా పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అని మరొక విధంగా ఆలోచిస్తున్నారట. అంటే 2023 దసరా సమయంలో కుదరకపోతే 2024 సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ రెండు తేదీలలో ఏది ఫిక్స్ అవుతుందో తెలియాలి అంటే చిత్ర నిర్మాణ సంస్థ మరో క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.