Just In
- 24 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ ఇంత తెలివిగా మోసం చేస్తాడని అనుకోలేదు.. పెళ్లి మ్యాటర్ ఇప్పట్లో లేనట్లే.. మరో ఐదేళ్లు బిజీగా
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న రెబల్ స్టార్ ఆ తరువాత వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి విజయం ఒక్కసారిగా అతని కెరీర్ ను మార్చేసింది. వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్ లో పెట్టి అభిమానులకు కిక్కు బాగానే ఇచ్చాడు గాని ఇంట్లో వాళ్లకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి.

అనుకోకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్
ప్రభాస్ బాహుబలి అనంతరం ఏదైనా చిన్న బడ్జెట్ సినిమా చేయాలనుకొని రన్ రాజా రన్ వంటి సినిమాను తెరకెక్కించిన యువ దర్శకుడు సుజిత్ ని లైన్ లో పెట్టాడు. అతనితో సాహో సినిమా చేయగా ఆ సినిమా అనుకోకుండా పాన్ ఇండియాగా మారిపోయింధి. వందల కోట్లు ఖర్చు చేయక తప్పలేదు. అయితే ఆ సినిమా తరువాత ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి.

తెలియకుండానే బిగ్ బడ్జెట్ సినిమాలు
ఆ మధ్య పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లిపై చాలా చర్చలు జరిపినట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో ఉన్న రాధేశ్యామ్ అయిపోని అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చాడని రూమర్ వచ్చింది. ఇక ఇంతలో లాక్ డౌన్ రావడం ఆ మధ్యలోనే ప్రభాస్ పూర్తిగా సినిమా కథలపై ఇంట్రెస్ట్ చూపించాడు. ఊహించని విధంగా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పుడైనా పెళ్లి చేద్దామనుకుంటే.. మరో షాక్
అప్పుడే ప్రభాస్ కుటుంబ సభ్యులు సైలెంట్ అయ్యారు. మరో రెండు మూడేళ్ళ తరువాత చూద్దామని అనుకున్నారట. కానీ ప్రభాస్ ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా అంటే ఫిట్నెస్ లో మార్పులు తీసుకొచ్చి ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఇక రీసెంట్ గా KGF టీమ్ తో సలార్ సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో రాజుగారి ఫ్యామిలీకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.

మరో ఐదేళ్లకు పైగా.. బిజీగానే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా సలార్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఇక రాధే శ్యామ్ వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు రానుండగా ఆది పురుష్ 2022లో వస్తుందో లేదో నమ్మకం లేదు. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్టు 2023లో రావచ్చు. ఇటీవల ఓకే చేసిన సలార్ 2024 లేదా ఆ తరువాత ఎప్పుడైనా రావచ్చు. ఈ విదంగా మరో ఐదేళ్లకు పైగా ప్రభాస్ సగం కెరీర్ కు సరిపడా సినిమాలను సెట్ చేసుకున్నాడు.

పెళ్లి ఆ సినిమాల తరువాత అంటే..
ప్రస్తుతం ప్రభాస్ వయసు 41 ఇక చేతిలో ఉన్న సినిమాలను మెల్లగా చేసుకుంటూ వెళితే మరో ఆరేళ్ళు లేదా ఏడేళ్ల సమయమైనా పట్టవచ్చు. పాన్ ఇండియా సినిమాలు కాబట్టి సమయం ఎక్కువే అవసరం అవుతుంది. ఈ విధంగా బిజీ బిజీ సినిమాల మధ్యలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది బిగ్ సస్పెన్స్. సినిమాలు అయిపోయిన తరువాత చేసుకుంటాను అంటే మాత్రం 46ఏళ్లు ఈజీగా దాటేస్తాయి. మరి ఈ సస్పెన్స్ కు రాజుగారు ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.