»   »  బాహుబలి : ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 40 కోట్లా..?

బాహుబలి : ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 40 కోట్లా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' అనే భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగా గెడ్డాలు, మీసాలు పెంచేయడమే కాదు....ఎంతో విలువైన తన సమయాన్ని దాదాపు రెండు సంవత్సరాలు కేవలం ఈ ఒక్క చిత్రం కోసం కేటాయించాడు.

ఫామ్‌లో ఉన్న ఒక స్టార్ హీరోకి రెండు సంవత్సరాల సమయంలో దాదాపు 5 సినిమాలు సునాయాసంగా చేసే వీలుంటుంది. ప్రభాస్ రేంజిని బట్టి ఐదు సినిమాలంటే కనీసం రూ. 150 నుంచి 200 కోట్ల బిజినెస్. ఈ నేపథ్యంలో ఆయనకు కనీసం ఓ రూ. 50 కోట్ల అయినా రెమ్యూనరేషన్ కింద సంపాదించే అవకాశం ఉంటుంది.

మరి ఇంత సంపాదన వదులుకుని ప్రభాస్ కేవలం ఒకే సినిమా కోసం 2 సంవత్సరాల కాల్షీట్లు ఇచ్చేసాడు. మరి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ప్రభాస్ ఏంత తీసుకుని ఉంటాడు? అనే చర్చ సర్వత్రా మొదలైంది. . ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని సినిమాల్లో నటించవచ్చో అన్ని సినిమాల పారితోషికాన్ని ఈ ఒక్క సినిమాకే తీసుకుంటున్నాడన్న పుకారు కూడా టాలీవుడ్‌లో షికారు చేస్తోంది.

ఒక హీరోకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారా? అని ఆశ్చర్యపడే రీతిలో ఈ సంఖ్యలు ఉంటున్నాయి. ఒకరేమో 20 కోట్లు అంటే మరి కొందరు 30 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కాదు ప్రభాస్ రెండు సంవత్సరాల పారితోషికం 40కోట్లు అని చెబుతున్నారు. మరి ఇంత పారితోషికం ఇచ్చే స్థాయి తెలుగు సినిమా పరిశ్రమకు ఉందా? మళ్లీ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? అన్న చర్చ కూడా ప్రస్తుతం సాగుతోంది.

దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.

అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

English summary

 It is known news that Prabhas has now got onto his next project ‘Bahubali’ and this magnum opus is being directed by S S Rajamouli. And now the talk is about the remuneration that Prabhas is taking for this film. According to sources, Rs 40 cr can be expected.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu