»   » ఆమె కోసమే ప్రభాస్-రానా మధ్య ఫైట్?

ఆమె కోసమే ప్రభాస్-రానా మధ్య ఫైట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి యువ హీరో రానా మధ్య ఒక మగువ కారణంగా ఫైట్ జరుగుతుందా? ఆమె కోసం ఇద్దరు శత్రవులుగా మారారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల నుంచి. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు, కేవలం రీల్ లైఫ్‌లో మాత్రమే. ఇద్దరు కలిసి నటిస్తున్న 'బాహుబలి' చిత్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంటుందట.

ఈ చిత్రంలో ప్రభాస్, రాణా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనుష్క హీరోయిన్. సినిమా కథ ప్రకారం ఇద్దరూ అనుష్కను ప్రేమిస్తారని, ఈ క్రమంలోనే ఇద్దరు ప్రత్యర్థులుగా మారుతారని సమాచారం. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా రానా సరసన ప్రణీతను తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వెలువడగా...అలాంటిదేమీ లేదని దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. వాస్తవానికి సినిమాలో మరో హీరోయిన్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు అనుష్కనే ప్రేమిస్తారు కాబట్టి. అదన్నమాట సంగతి.

'బాహుబలి' చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమా పబ్లిసిటీ విషయంలో ప్లానింగ్‌గా ముందుకు సాగుతున్నారు. తొలుత ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బాహుబలి తొలి మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మరొక మేకింగ్ వీడియో విడుదల చేసారు. బాహుబలి మూడో టీజర్ డిసెంబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు విడుదల చేయడానికి కారణం రానా పుట్టినరోజు కావడమే. అదే రోజు ఈచిత్రానికి సంబంధించిన రానా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ షూటింగ్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

English summary
According to Baahubali story, Prabhas and Rana are step brothers and they both fall in love with the same girl Anushka. Baahubali 3rd teaser on December 14 th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu