»   » నాగార్జున చిత్రంలో మెగా హీరోయిన్ కు ఛాన్స్, కీ రోలే

నాగార్జున చిత్రంలో మెగా హీరోయిన్ కు ఛాన్స్, కీ రోలే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ సరసన కంచె చిత్రంలో నటించిన ప్రగ్యా జైస్వాల్ కు ఆ తర్వాత చెప్పుకోదగిన ఆఫర్స్ ఏమీ రాలేదు. 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ వరుణ్ తేజ్ నటించిన 'కంచె'తో ప్రమోషన్ వచ్చినట్ల అని భావించింది. కానీ యంగ్ హీరోల నుంచి పిలుపు రాలేదు.

అయితే తన అందంతో, అభినయంతో అటు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్న ఈమెకు నాగార్జున నటించనున్న తాజా చిత్రంలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో హథీరామ్ బాబా కథతో నాగార్జున నటించబోతున్న సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం.

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో 'జానకి రాముడు', 'ఘరానా బుల్లోడు' లాంటి కమర్షియల్ చిత్రాలతో పాటు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిరిడీ సాయి' లాంటి భక్తిరస చిత్రాలు కూడా వచ్చాయి.

Pragya Jaiswal to sign Nag's Project

శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తుడైన హథీరాంబాబా జీవితగాథ ఆధారంగా రాఘవేంద్రరావు రూపొందించనున్న భక్తిరస చిత్రంలో నాగార్జు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కీరవాణి సంగీత సారథ్యంలో మ్యూజింగ్ సిట్టింగ్స్ గత నెలలో మొదలయ్యాయి . కాగా ఈ చిత్రాన్ని జూన్‌లో సెట్స్‌మీదకు తీసుకురానున్నట్లు నాగార్జున ప్రకటించారు.

నాగార్జున మాట్లాడుతూ... హథీరాంబాబా జీవిత కథ ఆధారంగా రూపొందనున్న చిత్ర విశేషాలు తెలియజేశారు. వెంకటేశ్వరుని పరమభక్తుని పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రానికి నమో వెంకటేశాయ అనే పేరును పరిశీలిస్తున్నారు.

అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి తర్వాత నాగార్జున-రాఘవేంద్రరావు కలయికలో వస్తున్న ఈ భక్తిరస చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనివున్నాయి.

English summary
Pragya Jaiswal is being considered for a pivotal role in the biopic of Hathiram Baba starring Akinneni Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu