»   »  మహేష్ బాబు సూచన మేరకే ప్రకాష్ రాజ్‌ను తీసేసారా?

మహేష్ బాబు సూచన మేరకే ప్రకాష్ రాజ్‌ను తీసేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prakash Raj out from Aagadu?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ప్రకాష్ రాజ్‌పై ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రం నుండి ప్రకాష్ రాజ్‌ను తీసేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.

షూటింగుకి ఆలస్యంగా రావడం, అసిస్టెంట్ డైరెక్టర్లను తిట్టడం లాంటి చేష్టలు చేస్తుండడంతో ఇక భరించలేక, మహేష్ సూచనపై అతన్ని దర్శక నిర్మాతలు తీసేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతని స్థానంలో సోనూ సూద్ ని తాజాగా తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయమై నిర్మాతల నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఆగడు సినిమా విశేషాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రంలో నటిస్తున్నసంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ పాట పాడబోతున్నాడని తెలుస్తోంది.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు.

14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్ కి తండ్రిగా రాజేంద్రప్రసాద్ చేస్తున్నారని సమాచారం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర.

English summary
Director Srinu Vaitla is currently busy with shooting schedules of ‘Aagadu’ movie as the director is willing to recreate the magic of Mahesh Babu’s smash hit movie ‘Dookudu’which was released more than 2 and half years. Sonu Sood replaced Prakash Raj role in this flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu