»   » ‘బాహుబలి’లో పవన్ కళ్యాణ్ మరదలు?

‘బాహుబలి’లో పవన్ కళ్యాణ్ మరదలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ పెద్ద మరదలు పాత్రలో నటించిన హీరోయిన్ ప్రణీత తన అంద చందాలు, పెర్ఫార్మెన్స్‌తో మెయిన్ హీరోయిన్ సమంతను డామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో ప్రణీత దశ తిరిగింది. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ సరసన రభస చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

తాజాగా అందుతున్న మరో ఆసక్తికర విషయం ఏమింటంటే... ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' చిత్రంలో ప్రణీతకు అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమెను రాణాకు జోడీగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ షూటింగ్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

English summary
Praneetha, who scored a decent hit with Power Star Pawan Kalyan’s “Attarintiki Daredi “ is getting crazy offers. Now another offer came to her from Tollywood Sensational Director Rajamouli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu