Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Balakrishna 108 కోసం సీనియర్ హీరోయిన్ ఫిక్స్.. అలా కలిసొస్తుందంటూ లెక్కలు!
చాలా కాలం పాటు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నారు. అదే జోష్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా అని చెప్పడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కూడా ఈ విషయాన్ని ఖరారు చేశారు. F త్రీ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాకి సంబంధించి ఈ మధ్యనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల పెద్ద మనిషి గా కనిపిస్తారని తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె గా పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల నటిస్తోందని కూడా ఆయన వెల్లడించారు.

ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించారని, దీంతో ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు. నిజానికి ప్రియమణి ఈ మధ్య కాలంలో చేస్తున్న అన్ని సినిమాలు దాదాపు హిట్ అవుతున్నాయి. దీంతో తమ సినిమాకు కూడా కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ప్రియమణి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఈ మధ్య బుల్లితెర మీద కూడా ఎక్కువగా కనిపిస్తూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇవన్నీ తమకు బాగా కలిసి వస్తాయని కూడా మేకర్స్ అంచనాలు వేసుకున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటికి వెలువడలేదు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తారని విషయం మీద కూడా ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు.