For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, రానా మూవీ నుంచి మరో లీక్: ఆ సీన్ పూనకాలు తెప్పించేలా.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాలే రెండు ఉన్నాయి. వీటిలో 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఇది మల్టీస్టారర్‌గా రూపొందుతుండడమే. ఇందులో పవన్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. అలాగే, ఇద్దరు డైరెక్టర్లు పని చేస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చిత్రం గురించి తాజాగా అదిరిపోయే పండుగ లాంటి ఒక వార్త ముందే బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? పూర్తి వివరాలు మీకోసం!

  ఇద్దరు హీరోలు.. ఇద్దరు డైరెక్టర్లు కలిసి

  ఇద్దరు హీరోలు.. ఇద్దరు డైరెక్టర్లు కలిసి

  మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'. దీన్ని పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా హీరోలుగా రీమేక్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు.

  మూవీ నేపథ్యం ఇదే... వాళ్లిద్దరి కథతో

  మూవీ నేపథ్యం ఇదే... వాళ్లిద్దరి కథతో

  'అయ్యప్పనుమ్ కోషియం'.. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు.

  షూట్ అప్‌డేట్.. అప్పటికి పూర్తయ్యేలా

  షూట్ అప్‌డేట్.. అప్పటికి పూర్తయ్యేలా

  ఆలస్యంగా ప్రకటించినా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ను ముందే ప్రారంభించాడు పవన్ కల్యాణ్. అంతేకాదు, అప్పుడు కొంత భాగం షూట్ కూడా పూర్తి చేశారు. కరోనా రెండో దశ రావడంతో దాన్ని నిలిపేశారు. అయితే, ఇప్పుడు షూటింగ్‌లు మొదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా జూలై 11 నుంచి పున: ప్రారంభించి.. ఆగస్టు చివరి కల్లా టాకీ పార్టును పూర్తి చేస్తారని తెలుస్తోంది.

  హీరోల పేర్లు కలిసేలా సినిమాకు టైటిల్

  హీరోల పేర్లు కలిసేలా సినిమాకు టైటిల్

  భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌ మూవీకి 'బిల్లా రంగ' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం 'పరశురామ కృష్ణమూర్తి' అనే పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.

  పవన్, రానా మూవీ నుంచి మరో లీక్

  పవన్, రానా మూవీ నుంచి మరో లీక్

  పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఎన్ని ఫైట్స్ ఉంటాయి? ఎన్ని పాటలు కంపోజ్ చేస్తున్నారు? ఏ నటుడు ఎలాంటి పాత్రను చేస్తున్నారు? అనే విషయాలు తరచూ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని మెయిన్ హైలైట్ తాజాగా లీక్ అయిపోయింది.

  Recommended Video

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
   ఆ సీన్ పూనకాలు తెప్పించేలా డిజైన్

  ఆ సీన్ పూనకాలు తెప్పించేలా డిజైన్

  తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ హైలైట్‌గా ఉంటుందట. థియేటర్లు దద్దరిల్లిపోయేలా, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా దాన్ని డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇక, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను జూలై 13, 14 తేదీల్లో జరపబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Ayyappanum Koshiyum Remake Under Saagar K Chandra Direction. Power Star Introduction Scene Highlight in This Move.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X