»   » బాలయ్య, పూరి సినిమా పై ఆ టైప్ లో దుష్పచారం? గిట్టని వాళ్ల పనేనా

బాలయ్య, పూరి సినిమా పై ఆ టైప్ లో దుష్పచారం? గిట్టని వాళ్ల పనేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే అఫీషియల్ ప్రకటన సైతం వచ్చేసింది. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది బాలయ్యపై గిట్టని వాళ్లు చేసే ప్రచారం అని కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు.

ఇంతకీ అదేమిటంటే...హాలీవుడ్ లో మంచి హిట్టైన 'జాన్ విక్'(2014)చిత్రం ఆదారంగా.. బాలయ్యకు తగినట్లు పూరీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఈ చిత్రంలో ట్విస్ట్ లు,యాక్షన్ అచ్చం బాలయ్య హిట్ చిత్రాల మాదిరిగా ఉండటమే కారణం అంటున్నారు. అయితే పూరి జగన్నాధ్ అంత చీప్ గా హాలీవుడ్ సినిమాని యాజటీజ్ లేపుతాడా..అదీ వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న సమయంలో అంటే ఆలోచించాలి.

Puri Jagannadh and Balakrishna movie is a fremake of Hollywood film

ఇది కేవలం రూమర్ అయ్యే అవకాసం ఉందని కొందరంటున్నారు. మహా అయితే ట్విస్ట్ లు వంటివి తీసుకుని తన నేర్పుతో ,తన పెన్ పవర్ తో సినిమా కథ అల్లి,బాలయ్యని మెప్పించి ఉంటాడంటున్నారు. మరో ప్రక్క ఈ క్రేజీ సినిమాకు యంగ్ టాలెంటెడ్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం చిరంజీవితో అనుకున్న ఆటోజాని కథనే చేస్తున్నాడంటున్నారు. ఇక ముందు బాలయ్యతో ఆయన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వెనక్కివెళ్లినట్టు తెలుస్తోంది.

నిర్మాత వి. ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్‌ఫుల్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. బాలకృష్ణగారి పవర్‌ఫుల్‌ యాక్షన్‌కీ, పూరి జగన్నాథ్‌గారిలో పెన్‌ పవర్‌కీ, ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది.

ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తాం. చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిస్తాం. షూటింగ్‌ కూడా ఆ రోజే మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో హీరోయిన్స్ లు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, మిగతా వివరాలను ప్రకటిస్తాం'' అన్నారు.

పూరి జగన్నాథ్ ఆమధ్య మహేష్‌తో జనగణమన సినిమాచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా చేయడానికి మహేష్ పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లోకి బాలయ్యని తీసుకువచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం చిరంజీవితో అనుకున్న ఆటోజాని కథనే చేస్తున్నాడంటున్నారు. ఏ కథని చేస్తున్నాడనే విషయం మాత్రం బయిటకు రాలేదు.

English summary
Hollywood flick John Wick is to be remade into Telugu by Balakrishna with Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu