పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో ప్రకాష్ రాజ్ రాజకీయాలు.. అలా సాయం చేస్తున్న దర్శకుడు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రస్తుతం రాజకీయ వివాదాలు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మాకు ఎలాంటి కోపం లేదని అంటూనే ఇవ్వాల్సిన కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు కలిసి వర్క్ చేసిన వారి కూడా గ్రూపులుగా విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రకాష్ రాజ్ కోసం పూరి జగన్నాథ్ కూడా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోకల్, నాన్ లోకల్

లోకల్, నాన్ లోకల్

లోకల్ నాన్ లోకల్ అంటూ ఇటీవల కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. మొదట ఆ పదం ఎప్పుడు ఎక్కడ పుట్టిందో గాని గత కొన్ని రోజులుగా జనాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. బయట జనాలకు ఈ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఎవరు గెలుస్తారనేది విషయంపై పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కు భారీ మద్దతు

ప్రకాష్ రాజ్ కు భారీ మద్దతు

ఇక ప్రకాష్ రాజ్ ఈ సారి ఊహించని విధంగా ఎన్నికల బరిలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ సీనియర్ యాక్టర్ సడన్ గా మా ఎన్నికల వైవు అడుగులు వేస్తూ ప్రత్యర్ధుల కామేంట్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మొత్తానికి ఆయనకు తెలుగు వారికి మద్దతు బాగానే అందుతోంది. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్ వెనుక నిలబడిన విషయం తెలిసిందే.

పోటీగా మంచు విష్ణు

పోటీగా మంచు విష్ణు

ఇక ప్రకాష్ రాజ్ కోసం కొంతమంది బిగ్ స్టార్స్ కూడా ప్రత్యేకంగా మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ అందినట్లు సమాచారం. నాగబాబు కూడా ప్రెస్ మీట్స్ లో పాల్గొంటు తన మద్దతును అందించారు. ఇక మరోవైపు మంచు విష్ణు పోటీగా నిలుస్తూ సూపర్ స్టార్ కృష్ణ మద్దతు అందుకున్నారు. నరేష్ ప్యానెల్ మొత్తం విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
బ్యాక్ గ్రౌండ్ లో పూరి జగన్నాథ్

బ్యాక్ గ్రౌండ్ లో పూరి జగన్నాథ్

ఇక మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కు పూరి జగన్నాథ్ కూడా గట్టిగానే హెల్ప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి మంచి స్నేహం ఉంది. ఇక ఎక్కువగా ప్రకాష్ రాజ్ చర్చలు పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచే జరుగుతున్నట్లు సమాచారం. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో పూరి తనవైపు నుంచి కూడా కొన్ని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. వీరి కలయిక బద్రి సినిమా నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X