»   » పేర్లు చెప్పేసి ఇరుక్కున్న పూరీ: అతని భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే...

పేర్లు చెప్పేసి ఇరుక్కున్న పూరీ: అతని భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇతర సెలబ్రిటీల పేర్లు చెప్పి చిక్కులో పడినట్లు అర్థమవుతోంది. తనపై అధికారులు గుప్పిస్తున్న ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఆయన కాస్తా ఆగ్రహంతో అనుకోకుండా ఇతరుల పేర్లు చెప్పారని అంటున్నారు.

దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు చిక్కుల్లో పడిన పూరీ దాదాపుగా ఏడ్చేసినంత పని చేశాడని ప్రచారం సాగుతోంది. దాదాపు పది గంటల విచారణలో ఆయన ముఖం ఎర్రబారి ఏడ్వడమే తక్కువ అనే పరిస్థితికి వచ్చినట్లు చెబుతున్నారు.

కెల్విన్‌తో పక్కా సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు చూపిన ఆధారాలతో ఆయన చిక్కుల్లో పడ్డారు. తాను ఏ పాపమూ ఎరుగనని ట్విట్టర్‌ వీడియోలో చెప్పినప్పటికీ ఫలితం లేకుండాపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

నాలుగు చోట్ల కలిశాడు....

నాలుగు చోట్ల కలిశాడు....

పూరీ జగన్నాథ్ కెల్విన్‌ను నాలుగు ప్రదేశాల్లో కలిసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారని సమాచారం. వారిద్దరి భేటీ విందుల్లోనూ సినీ సంబంధమైన కార్యక్రమాల్లోనూ జరిగిందని అంటున్నారు. డ్రగ్ కేసులో అరెస్టయిన కెల్విన్, ఇతరుల కాల్ డేటా రికార్డులు దర్యాప్తు అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం. నిందితులు, అనుమానితులు కలిసిన చోట్లకు సంబంధించిన సమాచారం కాల్ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Puri Jagannadh Reveals Names In Tollywood Drug Scandal | Filmibeat Telugu
ఆ తర్వాత మిగతావారు....

ఆ తర్వాత మిగతావారు....

ప్రస్తుతం దర్యాప్తు అధికారులు 12 మందికి నోటీసులు ఇచ్చి వరుసగా వారిని విచారిస్తున్నారు. పూరీతో పాటు మిగతా వాళ్లు చెప్పిన విషయాల ఆధారంగా మిగతావాళ్లకు ప్రస్తుతం జరుగుతున్న విచారణల తర్వాత నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కెల్విన్‌ ఎవరో తెలియదని చెప్పిన పూరీ, దర్యాప్తు అధికారులు ఆధారాలు చూపడంతో కంగు తిని వాస్తవాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో పూరీ కొందరి పేర్లు చెప్పాడని అంటున్నారు. పూరీ చెప్పిన విషయాల్లో ఏ మేరకు వాస్తవం ఉందనేది తెసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పూరీ గురించి తేలేది ఆ తర్వాతే....

పూరీ గురించి తేలేది ఆ తర్వాతే....

పూరీ కేవలం మత్తు పదార్థాలు తీసుకునేవాడు మాత్రమేనా, వాటిని సరఫరా చేసేవాడా (పెడ్లరా) అనేది ఇప్పుడే చెప్పేలమని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఇతర సినీ ప్రముఖులు చెప్పే విషయాలను బట్టి పూరీ ఏమిటనేది తేలుతుందని చెబుతున్నారు.

చాలా వైరుధ్యాలున్నాయి....

చాలా వైరుధ్యాలున్నాయి....

పూరీ చెప్పిన విషయాల్లో చాలా వైరుధ్యాలున్నాయని, ఆయన చెప్పిన విషయాల్లో ఒక్కదానికి మరోదానికి పొంతన కుదరడం లేదని అంటున్నారు. అందువల్ల, మరోసారి పూరీని విచారణకు పిలువాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం విచారణను ఎదుర్కుంటున్న 11 మంది చెప్పే విషయాల ఆధారంగా కూడా పూరీపై ఓ అభిప్రాయానికి రావడానికి వీలుంటుందని, అప్పుడు పూరీని పిలిచి విచారిస్తే విషయాలు బయటపడవచ్చునని అంటున్నారు.

English summary
IT official said the director Puri Jagannad personally met Calvin at "four different venues" while partying or at film-related functions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu